సాధారణంగా యాక్షన్ బ్యాక్‌డ్రాప్ ఉన్న తెలుగు సినిమాలు హిందీలో బాగా ఆడినా, యాక్షన్ డ్రామాగా రూపొందిన డాకు మహారాజ్ హిందీలో డిజాస్టర్‌గా నిలిచింది. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ కూడా కీలక పాత్రలో నటించినా పెద్దగా వర్కవుట్ కాలేదు. ఈ చిత్రం మొదటి రెండు రోజుల్లో 25 లక్షల మాత్రమే వసూలు చేసిందని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు.
అసలు ఈ కథ బాలీవుడ్ కు కొత్తేమీకాదు. బ్లాక్ అండ్ సినిమాలనుంచి బాలీవుడ్ ఈ తరహా కథలు వున్నాయి. కానీ బాలక్రిష్ణ చేత దర్శకుడు బాబీ చేసిన విధానం కూడా అక్కడివారికి నచ్చలేదు. బాబీ డియోల్ తో పాటు పలువురు వున్నారు కాబట్టి మంచి ఓపెన్సింగ్స్ ఆశించారు. కానీ హిందీలో ఈ సినిమా డిజాస్టర్. ఇప్పుడు సోషల్ మీడియాలో నిర్మాత నాగ వంశీని చాలా మంది ట్రోల్ చేస్తున్నారు. ఇంతకు ముందు నిర్మాత నాగ వంశీ, ఒక చర్చలో, అతను హిందీ సినిమాలు, వ్యాపారం, కొంతమంది నిర్మాతల గురించి దారుణంగా వ్యాఖ్యానించాడు. ఇప్పుడు, చాలా మంది ఈ 'డాకు మహారాజ్' ఫ్లాప్‌ను తీసుకొని నాగ వంశీని ట్రోల్ చేస్తున్నారు, అతని మునుపటి వ్యాఖ్యలకు జోడించారు. మీ సినిమా విడుదలైన తర్వాత 25 లక్షలు కూడా వసూలు చేయలేదు అని ట్రోల్ చేస్తున్నారు.