ఈరోజు, మూవీ సెకండ్ సింగిల్-శివశక్తిని డిసెంబర్ 22న కాశీలోని డివైన్ ఘాట్స్ లో లాంచ్ చేస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. శ్రీకాకుళం గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని, పురాతన శ్రీ ముఖలింగం శివాలయాన్ని ప్రతిబింబించే ఈ పాట సంగీతపరంగా, విజువల్ గా అద్భుతంగా వుండబోతోంది. పండుగను అత్యంత వైభవంగా జరుపుకునే అనుభూతిని అందిస్తామని మేకర్స్ వాగ్దానం చేశారు. ఈ జాతర పాటకు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు.
శివ శక్తికి సంబంధించిన పోస్టర్ నాగ చైతన్య, సాయి పల్లవి పవర్ ఫుల్ శివ శక్తి ఫోజ్ లో కనిపించడం ఆకట్టుకుంది. చుట్టూ పెద్ద సంఖ్యలో జనసమూహం, వారి సంప్రదాయ వస్త్రధారణ జాతర ఉత్సాహపూరిత వాతావరణం పాట యొక్క ఆధ్యాత్మిక ఇతివృత్తానికి జీవం పోస్తాయి. ఈ పాటను భారీ బడ్జెట్‌తో గ్రాండ్ స్కేల్ లో చిత్రీకరించారు, ఇది ఇప్పటివరకు నాగ చైతన్య కు మోస్ట్ ఎక్సపెన్సీవ్ ట్రాక్‌గా నిలిచింది.
నేషనల్ అవార్డ్ విన్నింగ్ కంపోజర్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా, షామ్‌దత్ సినిమాటోగ్రఫీని నిర్వహించారు, నేషనల్ అవార్డ్ విన్నర్ నవీన్ నూలి ఎడిటర్‌గా పని చేస్తున్నారు. శ్రీనాగేంద్ర తంగల ఆర్ట్ డైరెక్టర్.