ఈ చిత్రంలో వెర్సటైల్ యాక్టర్ శ్రీకాంత్ ఇంపార్టెంట్ రోల్ పోషిస్తున్నారు. ఈ రోజు శ్రీకాంత్ బర్త్ డే. ఈ సందర్భంగా విషెష్ అందిస్తూ మేకర్స్ శ్రీకాంత్ ని బ్రిటిషు పాత్రలో పరిచయం చేస్తూ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. రగ్గడ్ హెయిర్, గడ్డంతో బ్లాక్ కోట్ ధరించి ఫెరోషియస్ గా కనిపించిన శ్రీకాంత్ లుక్ వుంది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ ప్రతిష్టాత్మక వెంచర్‌లో అద్భుతమైన టెక్నికల్ టీం పని చేస్తోంది. వెట్రి పళనిసామి సినిమాటోగ్రఫీ, బి. అజనీష్ లోక్‌నాథ్ సంగీతం, నవీన్ విజయ కృష్ణ ఎడిటింగ్, గాంధీ నడికుడికర్ ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేస్తున్నారు
ఈ చిత్రం సెప్టెంబర్ 25, 2025న తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో పాన్ ఇండియా రిలీజ్ కానుంది.