Sai Tej: వెయ్యి మంది డ్యాన్సర్స్ తో 125 కోట్ల బడ్జెట్‌తో సంబరాల ఏటిగట్టు షూటింగ్

దేవి

బుధవారం, 5 మార్చి 2025 (16:19 IST)
Sai Durga Tej
సాయి దుర్గ తేజ్ ‘విరూపాక్ష’, ‘బ్రో’  తర్వాత సంబరాల ఏటిగట్టు లో కంప్లీట్ న్యూ, యాక్షన్-ప్యాక్డ్ ఇంటెన్స్ రోల్‌లో కనిపించనున్నారు. హనుమాన్  నిర్మాతలు కె నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి  ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ పై  హై బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన "కార్నేజ్" టీజర్‌ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. డైరెక్టర్ రోహిత్ కెపి గ్రిప్పింగ్ విజన్‌ తో సాయి దుర్గ తేజ్ పాత్రను లార్జర్ దెన్ లైఫ్ మేనర్ లో ప్రజెంట్ చేశారు. కార్నేజ్‌ వీడియో సాయి దుర్గ తేజ్ ఇంటెన్స్ క్యారెక్టర్ ని తెలియజేస్తుంది.
 
ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మూవీ టీం ఇటీవలే రామ్-లక్ష్మణ్ మాస్టర్స్ కొరియోగ్రఫీ చేసిన ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్స్ ని భారీ సెట్ లో పూర్తి చేశారు. చాలా రిస్క్ తో కూడుకున్న ఈ ఫైట్ సీక్వెన్స్ ని హీరో సాయి దుర్గ తేజ్ చాలా అద్భుతంగా పెర్ఫామ్ చేశారు. ఇది ప్రేక్షకులకు గ్రేట్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ అందించబోతోంది.
 
ప్రస్తుతం, టీం దినేష్ మాస్టర్ కొరియోగ్రఫీలో ఒక లావిష్ సాంగ్ ని చిత్రీకరిస్తోంది. ఈ పాటలో 1,000 మంది డ్యాన్సర్స్ కనిపించబోతున్నారు. ఇది రీసెంట్ టైమ్స్ లో షూట్ చేస్తున్న అదిరిపోయే సాంగ్స్ లో ఒకటిగా నిలుస్తోంది.
 
₹125 కోట్ల బడ్జెట్‌తో రూపొందుతున్న సంబరాల ఏటి గట్టు సాయి దుర్గ తేజ్ కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులలో ఒకటిగా నిలుస్తుంది.
 
ఈ చిత్రానికి వెట్రివేల్ పళనిసామి డీవోపీ, బి అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నారు. నవీన్ విజయకృష్ణ ఎడిటర్. గాంధీ నడికుడికర్ ప్రొడక్షన్ డిజైనర్. ఈ పాన్ ఇండియా మూవీ సెప్టెంబర్ 25, 2025న తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళంలో విడుదల కానుంది.
 
తారాగణం: సాయి దుర్గ తేజ్, ఐశ్వర్యలక్ష్మి, జగపతి బాబు, సాయి కుమార్, శ్రీకాంత్, అనన్య నాగళ్ల

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు