Supriya, Rajtarun,Kashish Khan, Srinu
శ్రీను వచ్చి కథ చెప్పాడు. బాగా నవ్వాను. ఇంత నవ్వించాడు కదా? సినిమా తీయాలని అనుకున్నాను. నాగార్జున, నాగ చైతన్యలకు వినిపించాను. తీయాలని అనుకున్నాం. కానీ కరోనా వచ్చి పడింది. సినిమా తీయాలా? అని అనుకున్నాం. కానీ మళ్లీ శ్రీను వచ్చాడు. ఏడాదికి ఒక్క సినిమా అది చిన్నదైనా పెద్దదైనా తీయాలని అనుకున్నాం. ఓ చిన్న సినిమాకు అన్నపూర్ణ బ్యాక్ ఎండ్లో ఉంటే ఎంత ధైర్యంగా ఉంటుందో అని మీరు నిరూపించారు. ఒక్క రూపాయి ఇచ్చి పది రూపాయల పని చేశారు. ఫస్ట్ ఈ కథ విన్నప్పుడు ఈ స్లాంగ్, ఈ కారెక్టర్ కోసం రాజ్ తరుణ్ గుర్తుకు వచ్చాడు. ఈ సినిమా చేస్తావా? అని నేనే అడిగాను. పక్కన మీకు నచ్చిన వాళ్లను పెట్టుకోండి. ఓ రెండున్నర గంటలపాటు సినిమాను చూసి ఎంజాయ్ చేయండి అని సుప్రియ అన్నారు.