టాలీవుడ్ సెన్సేషన్ శ్రీరెడ్డి... సోషల్ మీడియాలో రోజుకో పోస్ట్ పెడుతూ... వార్తల్లో నిలుస్తోంది. నాని అసలు రంగు బయటపెడతా అంటూ గత కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తోన్న శ్రీరెడ్డి తాజాగా అమెరికాలో బయటపడ్డ సెక్స్ రాకెట్ పైన తనదైన శైలిలో స్పందించింది. ఆ రాకెట్లో చిక్కుకున్న తారాల గురించి పరోక్షంగా కామెంట్లు చేస్తోంది. ఆదివారం మెగా కుటుంబంలోని ఓ హీరోతో నటించిన ఓ హీరోయిన్‌తో పాటు ఓ టీవీ యాంకర్ గురించి ప్రస్తావించిన శ్రీరెడ్డి... ఆ తర్వాత ఆ కామెంట్‌ను డిలీట్ చేసింది.
ఇక్కడ పతివ్రతల ముసుగులో నా మీద, నా పోరాటం గురించి వ్యతిరేకంగా మాట్లాడిన కొంతమంది నటీమణుల జాతకాలు తొందర్లోనే బయటకు వస్తాయి. అమ్మాయిలను వేదించుకుని తిన్నవారికి కఠిన శిక్ష పడాలి. నేను ఇందులో లేనని ఎంతో గర్వంగా చెబుతున్నా అని తెలియచేసింది. మరి... ఈ వివాదం ఎంతవరకు వెళుతుందో చూడాలి..!