దేవునికిచ్చిన మాట ప్రకారం బ్యాడ్ హ్యాబిట్స్ దూరం : సప్తగిరి

దేవీ

బుధవారం, 19 మార్చి 2025 (16:24 IST)
Saptagiri
పెళ్లి కాని ప్రసాద్' ట్రైలర్ చూపించిన శాసనాల గ్రంథం గురించి చెప్పాలంటే... ఇది చాలా ఫన్ ఓరియెంటెడ్ కాన్సెప్ట్. శాసనాల గ్రంథంలో కట్నాల గురించి తాత ముత్తాతల నుంచి ఆ గ్రంథంలో పొందుపరిచి ఉంటారు. కట్నం తీసుకోవడంలోని రూల్స్ రెగ్యులేషన్స్ ఆ గ్రంథంలో ఉంటాయి. అందులో ఉన్న రూల్స్ ప్రకారం కట్నం వస్తేనే పెళ్లి జరుగుతుంది. ఈ విషయంలో ఫాదర్ సన్ కాన్ఫ్లిక్ట్ ఆసక్తికరంగా వుంటుంది అని తన సినిమా గురించి సప్తగిరి తెలిపారు.
 
అభిలాష్ రెడ్డి గోపిడి దర్శకత్వం వహించిన ఈ చిత్రం హ్యుమర్, సోషల్ కామెంటరీ బ్లెండ్ తో పర్ఫెక్ట్ ఎంటర్ టైనర్ గా ఉండబోతోంది. థామ మీడియా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై విజన్ గ్రూప్‌ కె.వై. బాబు, భాను ప్రకాష్ గౌడ్, సుక్కా వెంకటేశ్వర్ గౌడ్, వైభవ్ రెడ్డి ముత్యాల కలిసి నిర్మించారు. చాగంటి సినిమాటిక్ వరల్డ్ సమర్పిస్తోంది. దిల్ రాజు నేతృత్వంలోని ప్రముఖ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ (SVC) ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తోంది. ఈ సినిమా మార్చి 21న థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా హీరో సప్తగిరి సినిమా విశేషాలు పంచుకున్నారు.
 
-సప్తగిరి ఎక్స్ ప్రెస్,  సప్తగిరి ఎల్.ఎల్.బి, వజ్ర మకుట దర గోవిందా.. ఈ మూడు సినిమాలు కమర్షియల్ జోనర్ లో మెప్పించే చిత్రాలు చేశాను. ప్రజలు 100% ఆదరించారు. ఫన్ జోనర్ లో కామెడీకి మంచి స్కోప్ ఉండే ఒక క్యారెక్టర్ చేయాలనుకున్నాను. అలాంటి సమయంలో పెళ్లి కాని ప్రసాద్ కథ వచ్చింది. స్క్రిప్ట్ విన్నాను చాలా నచ్చింది.
 
-డైరెక్టర్ అభిలాష్ ఈ కథ చెప్పినప్పుడు చాలా నవ్వించాడు. అప్పుడే సినిమా డెఫినెట్ గా వర్కౌట్ అవుతుందని నమ్మకం వచ్చింది. చిన్నచిన్న డౌట్స్ ఉంటే మారుతి గారి వద్దకి తీసుకువెళ్లి వినిపించాము.  ఆయన విని చాలా బాగుందని చెప్పి ఫస్ట్ కాపీ తో రమ్మని చెప్పారు. ఫస్ట్ కాఫీ తీసుకెళ్లి మారుతి గారి ఇంట్లోనే హోమ్ థియేటర్ లో చూశాం .ఆయన సినిమా చూసి చాలా అప్రిషియేట్ చేశారు. సరైన దారిలో సినిమాని తీసుకెళ్లారని అభినందించారు. అలా మీ ముందుకు వస్తున్నాం.  
 
-డైరెక్టర్ గారి ది. వెంకటేష్ గారి కెరీర్ లో ఐకానిక్ క్యారెక్టర్ పెళ్లి కాని ప్రసాదు. ఈ కథకి ఈ టైటిల్ పర్ఫెక్ట్.  ఆ టైటిల్ వెయిట్ ని కాపాడేలా ఉంటుంది సినిమా. ఎంటర్టైన్మెంట్ చాలా అద్భుతంగా వర్కౌట్ అయింది
 
- నన్ను అమ్మ పద్దతిగా పెంచింది. సిగరెట్, మందు అలవాటులేదు. ఏడేళ్ళవరకు బీర్ ఒక్కటిమాత్రమే తాగేవాడిని. వెంకటేశ్వరస్వామి మీద ప్రమాణం చేసి అదికూడా మానేశాను. నాన్ వేజ్ కూడా పెద్దగా తినను. మనం ఎదగాలంటే ఇవన్నీ అడ్డంకులని గ్రహించాను. ఏ అమ్మాయిని ప్రేమించలేదు. అందుకే నన్ను పెల్లికాని ప్రసాద్ అని పిలుస్తుంటారు. నాకు దైవభక్తి ఎక్కువ. ఈ సినిమా  సీన్స్ చూసి కంటెంట్ చాలా పాజిటివ్ గా వుంది  వెంకటేష్ గారు హిట్ కొట్టాలని బ్లెస్ చేశారు.
 
-  నేను అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసేటప్పుడు నా చిత్తూరు యాస గానీ, మాట్లాడే తీరుకానీ చూసి దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్, నా బాడీ లాంగ్వేజ్ వేరుగా వుందని చిన్న పాత్ర ఇచ్చారు. అది హిట్ అయింది. అలా వరసుగా వస్తున్న పాత్రలతో నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నాను.
 
-అభిలాష్ చాలా క్లారిటీ వున్న డైరెక్టర్. తను స్క్రిప్ట్ చెప్పినప్పుడే 70% డైలాగ్ వెర్షన్ తో చెప్పాడు. ఒక కమెడియన్ ని నవ్వించడం అంత ఈజీ కాదు.  కానీ అభిలాష్ ఈ కథ చెప్పినప్పుడు చాలా ఎంజాయ్ చేశాను. ఆ హ్యూమర్ స్క్రీన్ పైకి వచ్చింది ఖచ్చితంగా ఆడియన్స్ చాలా ఎంజాయ్ చేస్తారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు