టైటిల్, ఫస్ట్ లుక్ తో సహా ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన అప్‌డేట్‌లను మేకర్స్ రివిల్ చేశారు. ఈ సినిమా పెళ్లి కాని ప్రసాద్ అనే టైటిల్ పెట్టారు. ఇది ఐకానిక్ బ్లాక్‌బస్టర్ మల్లీశ్వరిలో విక్టరీ వెంకటేష్ క్యారెక్టర్ ని గుర్తు చేస్తోంది. ఫస్ట్ లుక్ పోస్టర్ సప్తగిరి పాత్ర హ్యుమర్ నేచర్ ని హైలైట్ చేస్తూ డిఫరెంట్ ఎక్స్ ప్రెస్షన్స్ ని ప్రెజెంట్ చేస్తోంది. ఈ పోస్టర్ హిలేరియస్ డిజైన్ ఈ చిత్రం హై ఎంటర్మైన్మెంట్ తో ఉంటుందని సూచిస్తుంది.
ఈ చిత్రానికి సుజాత సిద్ధార్థ్ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తుండగా, శేఖర్ చంద్ర సంగీతం అందిస్తున్నారు. మధు ఎడిటర్. ప్రియాంక శర్మ కథానాయికగా నటించారు, మురళీధర్ గౌడ్, లక్ష్మణ్ , అన్నపూర్ణమ్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
మార్చి 21న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు.
తారాగణం: సప్తగిరి, ప్రియాంక శర్మ, మురళీధర్ గౌడ్, లక్ష్మణ్, అన్నపూర్ణమ్మ, ప్రమోదిని, బాషా, శ్రీనివాస్, ప్రభావతి, రోహిణి, రాంప్రసాద్