శాసనాల గ్రంథం ప్రకారం అతను పెళ్లి చేసుకోవడానికి కనీసం 2 కోట్ల రూపాయలు కట్నం తీసుకోవాలి - అంతకన్నా తక్కువ అయితే కుదరదు. మరో సవాల్ ఏమిటంటే, కట్నం నగదు రూపంలో చెల్లించాలి. ఇంత కఠినమైన పరిస్థితులలో సప్తగిరి పెళ్లి కాని ప్రసాద్ (శాశ్వత బ్రహ్మచారి) గా ఎప్పటికీ ఉంటాడా? పెళ్లి అవుతుందా? అనేది చాలా హిలేరియస్ గా ప్రజెంట్ చేశారు.
సప్తగిరి తన అద్భుతమైన కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకున్నారు. ప్రియాంక శర్మ హీరోయిన్ పాత్రలో నటిస్తుండగా, మురళీధర్ గౌడ్, లక్ష్మణ్ కీలక పాత్రల్లో అలరించారు.
తారాగణం: సప్తగిరి, ప్రియాంక శర్మ, మురళీధర్ గౌడ్, లక్ష్మణ్, అన్నపూర్ణమ్మ, ప్రమోదిని, బాషా, శ్రీనివాస్, ప్రభావతి, రోహిణి, రాంప్రసాద్