అనంతరం అమల అక్కినేని మాట్లాడుతూ, క్రమశిక్షణ, మనలోని అంతర్‌శక్తికి డాన్స్ అనే ప్రక్రియ చక్కటి ఫ్లాట్‌ఫామ్ లాంటిది. కళ అనేది బతికున్నంతకాలం డాన్స్ వుంటుంది. రుక్ష్మిణీదేవి చెప్పినట్లు, డాన్స్ అనేది యోగ లాంటిది. మనలోని సామర్థ్యం, శక్తిని వెలికితీయడమేకాకుండా జీవితంలో ఉన్నతంగా ఎలా వుండాలనేది తెలియజేస్తుంది. చాలామంది కంప్యూటర్ ముందు కూర్చున్నవారు కానీ ఇతరత్రా కానీ ప్రస్తుతం ఒత్తిడికి గురవుతున్నారు. ఇలాంటి వారు డాన్స్ చేస్తే అద్భుతంగా యోగ చేసినట్లుగా వుంటుంది. నా వయస్సువారు చేయలేకపోయినా యువత ఇది అలవర్చుకోవాలి. డాన్స్ పై డాక్యుమెంటరీ చేయడం, అందులోనూ అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించడానికి ముందుకు రావడం చాలా గొప్పవిషయం. మన సంస్కృతి సంప్రదాయాలను ఇప్పటి జనరేషన్ తెలియజేసేలా సమీర్ చేసిన ప్రయోగం అభినందనీయం. ఇంతకుముందు సమీర్ `మోక్ష` అనే షార్ట్ ఫిలిం చేశాడు. డాన్స్, సినిమా అనేవి ఒకదానికి ఒకటి సమన్వయం అయివుంటాయి. నేను కళాక్షేత్రంలో గ్రాడ్యుయేట్ చేస్తుండగా, చాలా మంది సినిమావైపు మొగ్గారు. నేను డాన్స్‌ను సెలక్ట్ చేసుకున్నానని తెలిపారు.
అన్నపూర్ణ ఫిలిం స్కూల్ గ్రాడ్యుయేట్ అయిన సమీర్, ధృవ, హలో, అల వైకుంఠపురం వంటి పలు సినిమాలకు పనిచేశారు. ఈ డాక్యుమెంటరీకి కాన్సెప్ట్, క్రియేటర్- డి. సమీర్ కుమార్, నిర్మాత- సుప్రియ యార్లగడ్డ, ఎడిటర్- సాయి మురళీ, సంగీతం- కళ్యాణ్ నాయక్, సినిమాటోగ్రపీ- డి. సుమీర్ కుమార్, సౌండ్ డిజైన్- మహేష్, వి.ఎప్.ఎక్స్.- అనిల్, క్రియేటివ్ నిర్మాత- మహేశ్వర్ రెడ్డి గోజల.