టాలీవుడ్‌ని కుదిపేస్తున్న డ్రగ్స్ రాకెట్లో పూరీ జగన్నాధ్‌కి సన్నిహితులుగా ఉన్నవారే ఎక్కువగా ఉన్నారన వేరే చెప్పనవసరం లేదు. అందుకే ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని కెల్విన్‌తో మీకు ఏంటి సంబంధం అని సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. అలాగే పూరీ జగన్నాథ్‌తో మీకున్న సంబంధం ఏంటి అని కూడా ప్రశ్నిస్తున్నారు. దీంతో కెల్విన్ తర్వాత పూరీ జగన్నాథే టార్గెట్‌గా విచారణ సాగుతోందని అర్థమవుతోంది.
"అన్నయ్యా ఈ స్థాయిలో నేనుండటానికి కారణం మీరే. ఇందులో ఎలాంటి సందేహం లేదు. చిన్న పాత్రలు మొదలుకుని మెయిన్ విలన్‌గా, కేరక్టర్ ఆర్టిస్టుగా టాలీవుడ్లో నా స్థాయిని పెంచారు. అలాంటి మీ గురించి సిట్ అధికారులకు కొన్ని వివరాలు చెప్పాల్సి వచ్చింది. నేను కావాలని చెప్పలేదు. పరిస్థితులు నాతో అలా చేయించాయి. వారికి నేను ఏయే విషయాలు తెలిపాన్నది మీకు చెప్పలేను. నాకారణంగా మీకు ఈ కేసులో మరిన్ని ఇబ్బందులు తప్పవేమో.. నన్ను క్షమించండి. అందుకే మీకు నా ముఖం కూడా ఇకపై మీకు చూపించదని నిర్ణయించుకున్నాను" అంటూ ఏడ్చినంత పనిచేశాడట సుబ్బరాజు.
అయితే సుబ్బరాజును పూరీ జగన్నాథ్ ఏమీ అనలేదని అతడి సన్నిహితులు వివరించారు. ప్రస్తుతం మన టైమ్ సరిగా లేదని, త్వరలో అన్నీ సర్దుకుంటాయని సుబ్బరాజును ఓదార్చిన పూరి ఈ విషయాలేమీ మనసులో పెట్టుకోవద్దని సూచించినట్లు తెలుస్తోంది.