మాజీ బాలీవుడ్ నటి, గాయనీ సుచిత్రా కృష్ణమూర్తి సరికొత్త వివాదంలో చిక్కుకున్నారు. మసీదులో పొద్దునే వినిపించే నమాజ్ తాలూకు అజాన్‌పై కొంత కాలం కిందట సోనూ నిగమ్ చేసిన ట్వీట్ ఎంతటి దుమారం లేపిందో అందరికీ తెలిసిందే. తాజాగా అదే అంశంపై సుచిత్రా కృష్ణమూర్తి కూడా కామెంట్ చేసి చిక్కుల్లో పడ్డారు. నమాజ్ పేరిట ఐదింటికి చెవుల్లో వుండే కర్ణబేరి పగిలిపోయే రెండు శబ్ధాలు విన్నానని.. ఆ శబ్ధం పక్కనే ఉన్న మసీదు నుంచి వచ్చిందని.. ఇలా అనవసరంగా ఎక్కువ సౌండ్ పెట్టి ఎందుకు రాద్దాంతం చేస్తారో అర్థం కావట్లేదని సుచిత్ర ట్వీట్ చేసింది.
ఈ ట్వీట్లపై నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అర్థరాత్రుల వరకు తాగుతూ పార్టీలు చేసుకుని పెద్ద పెద్ద శబ్ధాల మధ్య గంతులేస్తూ.. తెలియని మగాళ్లతో తిరిగే మహిళ.. సంస్కృతి పైన దేశ ఆచారాలపైన మాట్లాడటం వింతగా ఉందని నెటిజన్లు ఘాటుగా స్పందించారు. దానికి సుచిత్ర కూడా పద్దతిగానే సమాధానం ఇచ్చింది. తానెక్కడా ఆజాన్ ఆచారంపైన, మతంపైన కామెంట్ చేయలేదు. అనవసర శబ్ధం గురించే కామెంట్ చేశానని చెప్పింది. అజాన్ గురించి ఎలాగైతే స్పందించానో.. అలాగే గోరక్షకుల పేరిట జరుగుతున్న దాడులపైనా స్పందించానని, ఆ ట్వీట్లను గమనించలేదా? అని నెటిజన్లు సుచిత్ర ప్రశ్నించారు.
సుచిత్ర ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా తనకు వచ్చిన బెదిరింపుల స్క్రీన్ షాట్లను తన ట్విట్టర్‌లో సుచిత్ర పోస్ట్ చేసింది. వికృతమైన వ్యక్తులున్న తన దేశాన్ని చూస్తుంటే జాలేస్తుందని.. మహిళల పట్ల ఇంత దారుణమైన దృక్పథం ఉన్నప్పుడు.. ప్రపంచ రేప్ రాజధానిగా మనదేశం ఉండటంలో ఆశ్చర్యం లేదంటూ సుచిత్ర ట్వీట్ చేసింది.