ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న జటాధర సినిమా షెడ్యూల్ చిత్రీకరణను పూర్తి చేసుకుంది.ఈ చిత్రం నటీనటులు, టెక్నీషియన్స్ సినీ ప్రయాణంలో మైల్‌స్టోన్ మూవీగా నిలిచిపోనుంది అంటూ చిత్ర యూనిట్ తెలుపుతోంది. ఇండియా మూవీగా సూపర్ నేచురల్ థ్రిల్లర్ జటాధరను తెలుగు, హిందీ భాషల్లో రూపొందిస్తున్నారు. సోనాక్షి సిన్హా, సుధీర్ బాబు, శిల్పా శిరోద్కర్, రవి ప్రకాష్, ఇంద్ర కృష్ణ, నవీన్ నేని, శుభలేఖ సుధాకర్, రాజీవ్ కనకాల, ఝాన్సి నటిస్తోన్న ఈ చిత్రాన్ని ప్రేరణ అరోరా, శివన్ నారంగ్, అరుణ అగర్వాల్ నిర్మిస్తున్నారు. అక్షయ్ క్రేజీవాల్, కుస్సుమ్ అరోరా సహ నిర్మాతలుగా, దివ్యా విజయ్ క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా, భవానీ గోస్వామి సూపర్‌వైజింగ్ ప్రొడ్యూసర్‌గా జటాధర సినిమా తెరకెక్కుతోంది.