బాలీవుడ్ చిత్రరంగంలోకి అడుగుపెట్టిన కొత్తల్లో తనను ప్రతి ఒక్కరూ పోర్న్‌స్టార్‌గానే చూశారనీ, అందువల్ల నా చేయి పట్టుకునే ఏ ఒక్క మగాడు ఇష్టపడలేదని నటి సన్నీ లియోన్ చెప్పుకొచ్చింది. కానీ, బాలీవుడ్ నటుడు చుంకీ పాండే మాత్రం నా చేయి పట్టుకుని స్టేజ్ మీదకు తీసుకెళ్లాడని, అందుకే అతనంటే తనకు ఎంతో మర్యాద అని చెప్పారు.
తాజాగా బాలీవుడ్ నటి నేహా దూపియాతో కలిసి సన్నీ లియోన్ ఓ షోలో పాల్గొంది. ఈ సందర్భంగా సన్నీ బాలీవుడ్‌లో అడుగుపెట్టిన తర్వాత పాల్గొని తొలి అవార్డు షో గురించి చెప్పుకొచ్చింది. అప్పుడు ఆర్గనైజర్లు తనను స్టేజ్‌పైకి రమ్మని ఆహ్వానించారనీ, అయితే, తనతోపాటు ఎవరైన యాక్టర్‌ను తీసుకురావాలని కోరారు.
అయితే తనతో స్టేజ్‌పైకి రావడానికి ఏ ఒక్క హీరో లేదా మగాడు ఇష్టపడలేదని సన్నీ వాపోయింది. ఏ నటి, నటుడు కూడా రాకపోవడంతో తాను చాలాసేపు అలాగే ఆగిపోయానని, చివరికి ఓ వ్యక్తి మాత్రం తన చేయి అందించాడని చెప్పింది. ఆ వ్యక్తి ఎవరో కాదు.. నటుడు చుంకీ పాండే. అందుకే ఇప్పటికీ అతనంటే తనకు ఎంతో గౌరవమని తెలిపింది.
కాగా, సన్నీ లియోన్ ఇపుడు బాలీవుడ్‌లో పెద్ద స్టార్. ఎప్పుడైతే సల్మాన్ ఖాన్ హోస్ట్ చేసే బిగ్‌బాస్ సీజన్ 5లో పార్టిసిపేట్ చేసిందో.. అప్పటి నుంచీ ఆమె పేరు ఇండియన్ ఆడియెన్స్‌కు తెలిసొచ్చింది. మహేష్ భట్ తన సినిమాలో చాన్స్ ఇవ్వడంతో సన్నీ దశ తిరిగిపోయింది. అయితే ఆమె గతంలో ఓ పోర్న్ స్టార్. ఇదే మొదట్లో ఆమెను చాలా ఇబ్బంది పెట్టింది. నిజానికి ఎన్నో అవమానాలకు కూడా గురైనట్లు సన్నీ చెప్పుకొచ్చింది.