సన్నీలియోన్.. పోర్న్ మూవీస్‌తో వరల్డ్ వైడ్ ఫేమస్ అయ్యి బాలీవుడ్ సెవెన్టీ ఎంఎంపై అడుగుపెట్టింది. వచ్చీ రావడంతో ఆల్‌రెడీ వున్న సెక్సీస్టార్స్‌ను వెనక్కి నెట్టేసి స్టార్ హోదాను దక్కించుకుంది. ఆల్‌రెడీ వున్న పోర్న్ ఇమేజ్ హిందీ స్క్రీన్‌పై హొయలొలికించడానికి బాగా పనికొచ్చింది. క్రమంగా పోర్న్‌స్టార్ ఇమేజ్ తుడిపేసుకుని బాలీవుడ్ ఆర్టిస్ట్‌గా పేరు తెచ్చుకుంది. మంచి హ్యూమన్ బీయింగ్‌గా కూడా పర్సనల్ ఇమేజ్‌ను బిల్డప్ చేసుకుని గౌరవప్రదంగానే వుంది. అయినా సరే యూత్ హార్ట్స్‌లో శృంగార తారగానే ముద్రపడింది.
సన్నీలియోన్ చేసిన హిందీ మూవీస్‌కి ఓ వర్గం ఆడియెన్స్ బ్రహ్మరథం పట్టారు. విమర్శలొచ్చినా సరే పట్టువదలకుండా బాలీవుడ్లో జెండా పాతేసింది. తెలుగులో కరెంట్ తీగలో యాక్ట్ చేసింది. రీసెంట్‌గా వచ్చిన పిఎస్వీ గరుడవేగలో ఐటమ్ సాంగ్ చేసింది. పిఎస్వీ గరుడవేగ హిట్టయింది. కానీ రిలీజ్‌కు ముందు ఆ సినిమాకు హైప్ తెచ్చిపెట్టింది సన్నీలియోన్.
ప్రస్తుతం ఎంటీవి కోసం ఓ షో చేస్తుంది. ఆ షూట్‌లో భాగంగా జరిగిన ఒక ఇన్సిడెంట్ సన్నీలియోన్ అభిమానులను ఉలిక్కి పడేలా చేసింది. సన్నీ లియోన్ ఉత్తరాఖండ్‌లోని కాశీపూర్ సమీప ప్రాంతాల్లో షూటింగ్‌లో ఉంది. ఎంటివిలో ప్రసారమయ్యే స్ప్లిట్ విల్లా ప్రోగ్రామ్ కోసం అక్కడ మకాం వేసింది ప్రోగ్రామ్ యూనిట్. ఈ ప్రోగ్రామ్ షూట్‌లో పాల్గొంటున్న సన్నీలియోన్ కాశీపూర్‌లోని బ్రిజేష్ ఆసుప్రతికి తరలించాల్సి వచ్చింది. దానిక్కారణం సన్నీలియోన్‌కు తీవ్రంగా కడుపునొప్పి రావడమే. ఈ న్యూస్‌తో సన్నీ ప్రేమికులు చాలామంది షాక్‌కు గురయ్యారు. అయితే ప్రస్తుతం సన్నీ ఆరోగ్యం బాగానే వుందని త్వరలోనే డిశ్చార్జ్ చేసే అవకాశం వుందంటున్నారు. సో... రియాల్టీ షోలో సన్నీ మెరుపులు తిరిగి మెరవడం ఖాయం అని తెలిసి అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.