సుప్రియ, రాధిక, స్వప్నాదత్‌లతో నిజం చెప్పించిన స్మిత

గురువారం, 13 ఏప్రియల్ 2023 (17:43 IST)
smita
నిజమ్‌ విత్‌ ;పాప్ సింగర్ స్మిత అంటూ సోనీలైవ్‌లో ప్రారంభం అవుతున్న ఎపిసోడ్‌లకు ఆదరణ వుంది. లేటెస్ట్‌గా పవర్‌ఫుల్‌ ఉమెన్‌ బిహైండ్‌ స్క్రీన్‌ పేరుతో సుప్రియ, రాధిక, స్వప్నాదత్‌లతో నిజం చెప్పించిన స్మిత ప్రోమో విడుదలైంది. ఒక్కొక్కరు తమ కెరీర్‌ ఆరంభంలో పడ్డ అడ్డంకులు ఏవిధంగా ఎదుర్కొన్నారో వెల్లడించారు.
 
Supriya, Radhika, Swapnadat
పాధర్‌ ఎవరో తెలీకుండా మీకెరీర్‌లో పడ్డ ఇబ్బందులు ఈ స్థాయి రావడానికి విధి అనొచ్చా అన్న స్మిత ప్రశ్నకు.. అవును. నాకన్నా అందంగా నాకన్నా టాలెంట్‌ వున్న వారు చాలా మంది వున్నారు. అంటూ తన డెస్టినీ గురించి చెప్పింది రాధిక.
 
మొదటి సినిమా పవన్‌ కళ్యాణ్‌తో నటించడం షూటింగ్‌కు భయపడి పారిపోవడం గురించి సుప్రియ చెబుతూ... రెండో షెడ్యూల్‌లో నేను నాలుగుసార్లు పారిపోయాను. ఇక నావల్ల కాదు అనుకున్నాను. అప్పుడు పవన్‌ కళ్యాణ్‌గారు నువ్వు చేయాలి. చేయగలవు. ఇది పూర్తిచేయి అంటూ ధైర్యాన్ని నూరిపోశారు అని తెలిపింది.
 
ఇక స్వప్న దత్‌ యంగ్‌ ఏజ్‌లో టెలివిజన్‌ స్టార్‌ చేసినప్పుడు అన్నీ డౌన్‌ ఫాల్సే. అప్స్‌ అనేవి లేవు. ఇలా డౌన్‌ ఫాల్స్‌ ఎన్ని వుంటాయి. ఎన్ని వున్నా సరే ధైర్యంగా ముందుకు సాగింది. అందుకు కారణం ఎవరు? అనేది ఆసక్తికరంగా ఈ వివరాలు చూడాలంటే ఈనెల 14వ తేదీన సోనీలైవ్‌లో చూడొచ్చని ప్రోమోలో తెలిపారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు