జై భీమ్‌కు అరుదైన ఘనత.. ఆస్కార్ య్యూట్యూబ్ ఛానల్‌లో..?

గురువారం, 20 జనవరి 2022 (12:07 IST)
దీపావళికి సూర్య నటించిన జై భీమ్ సినిమా రిలీజైంది. అమెజాన్ ఓటీటీలో రిలీజ్ అయిన ఈ సినిమా దేశంలోనే కాక విదేశాల నుంచి కూడా అభినందనలు పొందుతుంది. ప్రస్తుతం ఈ సినిమా ఖాతాలో అరుదైన ఘనత చోటుచేసుకుంది.
 
అకాడమీ ఆఫ్‌ మోషన్‌ పిక్చర్ ఆర్ట్స్‌ అండ్‌ సైన్సెస్‌ (ఆస్కార్‌) అధికారిక యూట్యూబ్‌ ఛానెల్‌లో ‘సీన్‌ ఎట్‌ ది అకాడమీ’ పేరుతో ఈ సినిమాలోని సీన్స్ గురించి చెప్తూ ఓ వీడియోను పోస్ట్ చేశారు. 
 
ఆస్కార్ యూట్యూబ్ వేదికగా మన సినిమా గురించి అందులోని సీన్స్ గురించి మాట్లాడుతూ వీడియో పోస్ట్ చేయడం గర్వకారణం. ఈ ఛానల్ లో ‘జైభీమ్‌’ సినిమా గురించి ప్రస్తావించడంతో చిత్ర యూనిట్ తో పాటు ప్రేక్షకులు కూడా హర్షం వ్యక్తం చేశారు.
 
జస్టిస్‌ చంద్రు అనే లాయర్ జీవిత కథతో పాటు అతను డీల్ చేసిన ఓ కేసు ఆధారంగా జైభీమ్ సినిమాని తెరకెక్కించారు. ఇప్పటికే ఈ సినిమా అనేక రికార్డులని సాధించింది. ఐఎండీబీ రేటింగ్స్‌లో హాలీవుడ్ సినిమాలని దాటి 9.6 రేటింగ్‌ కూడా సాధించింది.  అలాగే గోల్డెన్‌ గ్లోబ్ 2022 పురస్కారానికి కూడా నామినే​ట్‌ అయింది జై భీమ్ సినిమా.
 
ఇకపోతే గతంలో ‘ఆకాశమే నీ హద్దురా’ సినిమా కూడా మంచి విజయం సాధించి అనేక అవార్డుని గెల్చుకుంది. ఆ సినిమా కూడా ఇండియా నుంచి ఆస్కార్ నామినేషన్స్‌లో నిలిచింది.  

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు