సుశాంత్ పోస్ట్‌మార్టం రిపోర్టు పరిశీలించేందుకు ప్రత్యేక బృందం

శనివారం, 22 ఆగస్టు 2020 (15:43 IST)
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ కేసును సుప్రీంకోర్టు ఆదేశం మేరకు సీబీఐ దర్యాప్తు చేస్తోంది. ఇప్పటికే దర్యాప్తు చేపట్టిన సీబీఐ... సుశాంత్ పోస్టుమార్టం నివేదికను పరిశీలించేందుకు ఎయిమ్స్‌కు చెందిన నలుగురు వైద్యులతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ బృందానికి డాక్టర్ సుధీర్ గుప్తా నాయకత్వం వహిస్తున్నారు. ఈ బృందం సుశాంత్ రిపోర్ట్ ప‌రిశీలించి, దానిపై క్లియ‌ర్ రిపోర్ట్ ఇవ్వ‌నున్నారు.
 
ఇప్ప‌టికే సుశాంత్ పోస్ట్‌మార్టం రిపోర్ట్‌ని ఎయిమ్స్ బృందం స్వాధీనం చేసుకోగా, దానిని ప‌రిశీలిస్తుంది. దీనిపై అధ్య‌య‌నం పూర్తైన తర్వాత ముంబైకి వెళుతుంది. కాగా డాక్టర్ సుధీర్ గుప్తా ఎయిమ్స్‌‌లో ఫోరెన్సిక్ విభాగానికి హెడ్‌గా ప‌నిచేస్తున్నారు. సునంద పుష్కర్, షీనా బోరా కేసులో కూడా ఆయ‌న వారి పోస్టుమార్టం రిపోర్టును ప‌రిశీలించిన అనుభవం కూడా ఉంది. 
 
సుశాంత్ 'స్త్రీ'లోలుడా? 
బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ ఆత్మహత్య తర్వాత ఆయన క్యారెక్టర్‌, విలాసాలు, జల్సాలకు సంబంధించిన అనేక విషయాలు రోజుకొకటి చొప్పున వెలుగులోకి వస్తున్నాయి. బాలీవుడ్ చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు హీరోయిన్లతో ఈ కుర్ర హీరో ప్రేమాయణం కొనసాగించినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ బహుముఖ ప్రేమలే చివరకు ఆయన బలవన్మరణానికా కారణమయ్యాయనే విమర్శలు లేకపోలేదు. 
 
సుశాంత్ నడిపిన ప్రేమాయణాల్లో భాగంగా, బాలీవుడ్ నటుడు సైఫ్ అలీకాన్ కుమార్తె, హీరోయిన్ సారా అలీఖాన్‌తో పీక‌ల్లోతు ప్రేమ‌లో మునిగితేలాడ‌నే విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఈ విషయాన్ని సుశాంత్ స్నేహితుడు శామ్యూల్ హోకిప్ బహిర్గతం చేశారు. పైగా, సుశాంత్ - సారా ప్రేమకు సంబంధించిన కీలక విషయాలను ఆయన వెల్లడించారు.
 
ముఖ్యంగా, "కేదార్‌నాథ్" చిత్రం కోసం సుశాంత్, సారా అలీఖాన్ కలిసి పనిచేశారు. ఈ సినిమా స‌మ‌యంలో ఇద్దరి మ‌ధ్య ప్రేమ చిగురించింది. కొద్ది రోజుల‌కే ఆ ప్రేమ మరింతగా బలపడింది. చిత్ర ప్ర‌మోష‌న్ స‌మ‌యానికి సుశాంత్ - సారా డీప్ ల‌వ్‌లో ఉన్నారు. ఈ మూవీ త‌ర్వాత సుశాంత్ న‌టించిన 'సోన్‌చిరియా' చిత్రం ఫ్లాప్ కావ‌డంతో సారా.. సుశాంత్‌కి దూర‌మైంది. పీకల్లోతు ప్రేమలో ఉన్న సారా.. ఈ చిత్రం ఫెయిలైన తర్వాత సుశాంత్‌కు బ్రేకప్ చెప్పడం తనను ఆశ్చర్యానికి లోనుచేసిందని శామ్యూల్ చెప్పుకొచ్చాడు.
 
వాస్తవానికి ఇద్ద‌రి మ‌ధ్య ప్రేమ చిన్న పిల్ల‌లలో ఉండే స్వ‌చ్ఛ‌మైన ప్రేమ‌లా క‌నిపించేంది. ఒక‌రిపై ఒక‌రికి చెప్ప‌లేనంత గౌర‌వం ఉండేది. ఒకరిపై మరొకరు కవితలు చెప్పుకొనే వారు. పీక‌ల్లోతు ప్రేమ‌లో ఉండేవారని చెప్పుకొచ్చారు. అయితే, సుశాంత్‌తో రియా చక్రవర్తి పరిచయం తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని తెలిపారు. సుశాంత్ - సారాను రియానే విడిదీసిందని తాను బలంగా నమ్ముతానని శామ్యూల్ హోకిప్ చెప్పుకొచ్చారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు