మిస్ యూనివర్స్ పోటీలు.. న్యాయ నిర్ణేతగా సుస్మితా సేన్.. 23 ఏళ్ల తర్వాత..?

శనివారం, 21 జనవరి 2017 (19:08 IST)
23 ఏళ్ల క్రితం మిస్ యూనివర్స్ కిరీటం గెలుచుకున్న ప్రపంచ సుందరి సుస్మితా సేన్.. ఈసారి ప్రపంచ సుందరి పోటీల్లో కాకుండా న్యాయ నిర్ణేతగా అవతారం ఎత్తనుంది. 23 ఏళ్ల తర్వాత తాను మిస్ యూనివర్స్ కిరీటం గెలుచుకున్న గడ్డపైకి అడుగుపెడుతున్నానని.. సొంత ఇంటికి వెళ్తున్న భావన కలుగుతోందని హర్షం వ్యక్తం చేశారు. త్వరలో ఫిలిప్పీన్స్‌లో కలుద్దాం అంటూ సోషల్‌మీడియాలో రాశారు.
 
కాగా.. ప్రపంచ సుందరిని ఎన్నుకునే న్యాయ నిర్ణేతల ప్యానెల్‌లో ఒక సభ్యురాలిగా మాజీ మిస్‌ యూనివర్స్‌ సుస్మితా సేన్‌ హాజరుకానున్నారు. ఫిలిప్పీన్స్‌లో జనవరి 30న జరగబోయే మిస్‌ యూనివర్స్‌ పోటీలకు తాను హాజరయ్యేందుకు సిద్ధమవుతున్నానని, విజేతను ఎంపిక చేసే ప్యానెల్‌లో తాను సభ్యురాలిగా ఉండటం ఎంతో ఆనందంగా ఉందని సుస్మితా సేన్ వెల్లడించింది.

వెబ్దునియా పై చదవండి