చూస్తున్నంతసేపు రోమాలు నిక్కబొడుచుకుంటాయ్ : "సైరా" ఫస్ట్ రివ్యూ (video)

మంగళవారం, 1 అక్టోబరు 2019 (13:32 IST)
మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రం "సైరా నరసింహా రెడ్డి". ఈ చిత్రం అక్టోబరు రెండో తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రంలో చిరంజీవితో పాటు... అమితాబ్, నయనతార, తమన్నా, జగపతి బాబు, కిచ్చా సుధీప్, విజయ్ సేతుపతి వంటి అగ్ర నటీనటులంతా నటించారు. ఈ చిత్రాన్ని రూ.250 కోట్ల భారీ బడ్జెట్‌తో హీరో రామ్ చరణ్ తన నిర్మాణ సంస్థ కొణిదెల కంపెనీ ప్రొడక్షన్‌పై నిర్మించారు. 
 
ఈ చిత్రం ప్రీమియర్ షోలు అమెరికాలో మంగళవారం ప్రదర్శిస్తున్నారు. అయితే, ఈ చిత్రాన్ని ప్రముఖ జర్నలిస్ట్, సినీ విమర్శకుడు, యూకే సెన్సార్ బోర్డు సభ్యుడు ఉమైర్ సంధు 'సైరా' సినిమా చూసి సోషల్ మీడియా ద్వారా తన అభిప్రాయాలను వెల్లడించారు. 'సైరా' చూస్తున్నంత సేపూ రోమాలు నిక్కపొడుచుకోవడం ఖాయం. స్వాతంత్ర్య పోరాటంలో జరిగిన ఎన్నో విషయాలను కళ్లకు కట్టినట్లు చూపించడంలో దర్శకుడు సురేందర్‌ రెడ్డి విజయవంతమయ్యారు. 
 
ఈ చిత్రంలో కొన్ని సన్నివేశాలు గుండెలను హత్తుకుంటాయి. తొలిసారి చారిత్రక పాత్రలో నటించిన చిరంజీవి చరిత్రలో నిలిచిపోతారు. జాతీయ అవార్డే తన కోసం వేచి చూసేలా అత్యద్భుతంగా నటించారు. నర్సింహారెడ్డి ఇలాగే ఉండేవారేమోననే రీతిలో చిరంజీవి ఆ పాత్రలో జీవించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపడం ఖాయం. హిందీ బెల్ట్‌లో కూడా ఈ సినిమా రికార్డులు సృష్టిస్తుందని ఉమైర్ సంధు వరుస ట్వీట్లు చేశారు. దీంతో మెగా అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. 
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు