రేనాటి వీరుడి కథ "సైరా".. దుమ్మురేపుతున్న మెగాస్టార్

గురువారం, 19 సెప్టెంబరు 2019 (08:26 IST)
మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం సైరా నరసింహా రెడ్డి. రేనాటి వీరుడి జీవిత కథను ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని టాలీవుడ్ యువ హీరో రాం చరణ్ నిర్మించగా, ఇందులో అమితాబ్, నయనతార, జగపతిబాబు, విజయ్ సేతుపతి, సుధీప్ వంటి భారీ తారాగణం నటించింది. తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో అక్టోబరు రెండో తేదీన విడుదలకానున్న ఈ చిత్రం ట్రైలర్‌ను బుధవారం సాయంత్రం విడుదల చేశారు. 
 
ఇటీవలే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వాయిస్ ఓవర్‌తో ఈ సినిమా నుంచి ఒక టీజర్‌ను రిలీజ్ చేయగా, దానికి అనూహ్యమైన స్పందన వచ్చింది. 'రేనాటి వీరులారా చరిత్రలో మనం ఉండకపోవచ్చు. కానీ చరిత్ర ఈ రోజు మనతోనే మొదలవ్వాలి' అంటూ చిరూ చెప్పిన డైలాగ్ టీజర్లో హైలైట్ అయింది.
 
తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ప్రధాన పాత్రధారులందరినీ కవర్ చేస్తూ ఈ ట్రైలర్‌ను కట్ చేశారు. ఆంగ్లేయులపై నరసింహారెడ్డి తిరుగుబాటు.. నరసింహారెడ్డి ఆచూకీ కోసం ఆంగ్లేయులు అక్కడి ప్రజలను హింసించడం ఈ ట్రైలరులో చూపించారు. 
 
'స్వేచ్ఛ కోసం ప్రజలు చేస్తోన్న తిరుగుబాటు.. నా భరతమాత గడ్డమీద నిలబడి హెచ్చరిస్తున్నా.. నా దేశం వదిలి వెళ్లిపోండి.. లేదా.. యుద్ధమే' అంటూ చిరంజీవి చెప్పిన డైలాగ్ ఈ ట్రైలర్‌కి హైలైట్‌గా నిలిచింది. ఈ ట్రైలర్‌ ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. 
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు