వారికి బాగా దగ్గరవ్వాలనే అలా చూపించా... తప్పేంటి? తమన్నా ప్రశ్న

శనివారం, 24 డిశెంబరు 2016 (18:59 IST)
తమన్నా 'ఒక్కడొచ్చాడు' సినిమాలో చాలా ఎక్స్‌పోజింగ్‌ చేసిందని చూసినవాళ్ళు చెబుతున్నారు. ఈ విషయమై తమన్నా స్పందిస్తూ.. గ్లామర్‌గా నటించాల్సి వచ్చింది. నా పాత్ర నిడివి తక్కువైనా వున్నంతలో మాస్‌ ప్రేక్షకులకు దగ్గరయ్యేందుకు పాటల్లో అలా కన్పించాననీ, అందులో తప్పేమిటని వివరణ ఇచ్చింది. 
 
శనివారంనాడు  హైదరాబాద్‌లో ఆమె చిత్రం గురించి మాట్లాడింది. ముఖ్యంగా కరెక్ట్‌ టైమ్‌లో కరెక్ట్‌ సినిమా తనకిదని పేర్కొంది. పునర్జనమ్మ కథతో ఈ చిత్రం రూపొందింది. ఈ విషయమై మాట్లాడుతూ.. నేను పునర్జన్మలను పెద్దగా నమ్మను... ప్రస్తుతం ఉన్న జన్మ గురించి ఆలోచిస్తానని చెప్పింది.

వెబ్దునియా పై చదవండి