అభినేత్రి కోసం ప్రభుదేవాతో తెల్లపిల్ల తమన్నా స్టెప్పులు.. అదరగొట్టేసింది..!

బుధవారం, 6 జులై 2016 (10:43 IST)
హ్యాపీడేస్‌‍తో హిట్ కొట్టి బాహుబలితో ప్రపంచ వ్యాప్తంగా అవంతికగా పేరు కొట్టేసిన తమన్నా.. ప్రస్తుతం ప్రభుదేవాతో ఓ సినిమా చేస్తోంది. తమన్నాకు డ్యాన్స్‌ల్లో తిరుగులేదని చాలామంది అంటారు. తాజాగా సోనూసూద్-ప్రభుదేవాలతో కలిసి తమన్నా కొత్త సినిమా చేస్తోంది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఏకకాలంలో రిలీజ్ కానున్న ఈ సినిమాలోని ఓ పాట కోసం తమన్నా.. కొరియోగ్రాఫర్, నటుడు ప్రభుదేవా నేతృత్వంలో డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తోన్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది 
 
ఈ వీడియో లింకును తమన్నా ట్విట్టర్ ద్వారా అభిమానులతో షేర్ చేసుకుంది. ఈ వీడియోకు మంచి రెస్పాన్స్ వస్తోంది. తమన్నాలో జోష్ ఏమాత్రం తగ్గట్లేదని టాక్ వస్తోంది. ఏఎల్ విజయ్ డైరెక్షన్‌లో వస్తున్న ‘అభినేత్రి’ మూవీకి జీవీ ప్రకాశ్ కుమార్ మ్యూజిక్ డైరెక్టర్ కాగా, రచయిత కోన వెంకట్ స్టోరీని అందిస్తున్నాడు.

వెబ్దునియా పై చదవండి