నటి తమన్నా అచ్చమైన గ్రామీణ యువతిగా నటిస్తోంది. అందుకు సంబంధించిన సన్నివేశాలను రాజమండ్రిలో చిత్రిస్తున్నారు. తమిళ నటుడు విజయ్ సరసన ఆమె నటిస్తోంది. తమిళం, తెలుగు భాషల్లో రూపొందుతోన్న ఈ చిత్రానికి 'భైరవ' అనే టైటిల్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. 'లెజెండ్' చిత్రంతో విలన్‌గా మారిన జగతిబాబుకు అటువంటి పాత్రలకు కేరాఫ్ అడ్రెస్‌గా మారిపోయారు.
విజయ్ నటిస్తున్న 'భైరవ'లో ప్రతినాయకుడిగా నటిస్తున్నాడు. రాజమండ్రిలో పదిరోజులపాటు కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. గ్రామీణ వాతావరణంలో సాగే సన్నివేశాలు, ఓ పాటను ఇక్కడ చిత్రించారు. శుక్రవారం నుంచి మిగిలిన షెడ్యూల్‌ను ఫిలింసిటీలో చిత్రించనున్నారు.