సినిమా ప్రపంచంలో వెలుగునీడలు మామూలే. వెలిగిపోయేవారు ఉవ్వెత్తున స్టార్ల మాదరిగా కనబడుతూ ప్రేక్షకుల గుండెలను గుల్ల చేస్తుంటారు. అవకాశాలు వచ్చినట్లే వచ్చి చేజారిపోయి ఫేడవుట్ అయిపోయినవారికి ఇక సినిమా అవకాశాలు రాకుండా పోతాయి. అలాంటివారితోపాటు సినిమాల్లో నటించాలనే కుతూహలంతో సినీ ఇండస్ట్రీకి వచ్చి మోసగాళ్ల చేతిలో పడి మోసపోయేవారు ఉన్నారు. ముఖ్యంగా యువతులు ఎక్కువగా మోసపోయి తమ జీవితాలను చీకట్లోకి నెట్టేసుకుంటారు. వారి ఆశలను ఆసరాగా చేసుకుని కొందరు ఇండస్ట్రీ ముసుగులో అమ్మాయిలను లొంగదీసుకుని వారి జీవితాలను నాశనం చేస్తుంటారు. తాజాగా ఇలాంటి ఉదంతమే తమిళనాడులో జరిగింది.
సినిమా ఛాన్సులే కాదు మెడికల్ సీట్లు కూడా ఇప్పిస్తానంటూ కోట్లకు కోట్లు కాజేసినట్లు సమాచారం. ఇతడు ఉన్నత చదువులు చదవడంతో ఆంగ్లం, హిందీ బాగా మాట్లాడుతాడనీ, అందువల్ల తనతోపాటు అమ్మాయిలను ఉత్తరాదికి తీసుకెళ్లి అక్కడ జల్సాలు చేస్తున్నట్లు కనుగొన్నారు. పక్కా ప్రణాళికతో తమిళనాడు పోలీసులు వల వేసి ఇతడిని తిరుపూర్లో పట్టుకున్నారు.