Tammareddy: మంచు విష్ణు, మనోజ్ కు మధ్యవర్తిగా తమ్మారెడ్డి భరద్వాజ

దేవీ

బుధవారం, 28 మే 2025 (16:35 IST)
Tammareddy Bharadwaja, Vishnu
తెలుగు సినిమా రంగంలో మోహన్ బాబు, మంచు విష్ణు, మనోజ్ మధ్య జరిగిన వివాదాలు, గొడవలు, కోర్టు కేసుల గురించి అందరికీ తెలిసిందే. దీనిపై ఇండస్ట్రీలోని కొంతమందిపెద్దలు వారి మధ్య సర్దుబాటు చేయడానికి ప్రయత్నించారు. కానీ మరలా మొదటికే వచ్చింది. కొలిక్కిరాలేదు. ఈ విషయంలో తమ్మారెడ్డి భరద్వాజ వారిని నయోధ్య చేసేందుకు ముందుకు వచ్చారు. ఈ విషయాన్ని ఆయనే తెలియజేశారు.
 
మంచు విష్ణు నటించిన కన్నప్ప ప్రయోషన్ లో విష్ణు ను భరద్వాజ ఓ ప్రశ్న వేశారు. మీ ఫ్యామిలీ ముగ్గురు మంచి వాళ్ళే. నేను అందరితో అదే చెబుతాను. కానీ ఈమధ్య కుటుంబంలో వచ్చిన భేదాభిప్రాయాలు, కేసులు చూస్తుంటే నా ఫ్యామిలీలో జరిగినట్లుగా అనిపించింది. బాధ పడ్డాను. అసలు ఎందుకు ఇలా జరిగింది. కనుక నేను పెద్దగా మీ సమస్యను పరిష్కరించాలనుకుంటున్నాను. అందుకు మీరు సమ్మితిస్తేనే అని అడిగారు.
 
అందుకు విష్ణు స్పందిస్తూ, అంకుల్ మీరు మాకు చిన్నప్పటినుంచి తెలుసు. మా కుటుంబానికి కావాల్సినవారు. నాన్నగారికి మీరు అంతే. ఇండస్ట్రీలో తన, మన అనేది వుంటుంది. మా జనరేషన్ కు పెద్దలు మీరు. బేధాభిప్రాయాలు వుండొచ్చు. మీ సూచన చేస్తే తప్పకుండా అమలు చేస్తాం.కనుక మా మధ్య భేదాభిప్రాయాలు వుండడం మామూలే. అయితే, కన్నప్ప సినిమా రిలీజ్ అయ్యాక మీరు చెప్పినట్లు తప్పకుండా చేద్దాం అని  బదులిచ్చారు. ఇప్పటికే మంచు మనోజ్ కూడా పలువురు పెద్దలను సంప్రదించి తన వైపు తప్పులేదని వివరించారు కూడా. మరి తమ్మారెడ్డి సాల్వ్ చేస్తారోలేదో చూడాలి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు