Renu Desai, Arvind Krishna and others
అరవింద్ కృష్ణ, బిగ్ బాస్ ఫేమ్ దివి, మేఘన శ్రీనివాస్, వినయ్ కీలక పాత్రల్లో విల్లర్ట్ ప్రొడక్షన్ హౌస్ బ్యానర్‌లో 1000 వర్డ్స్ అనే సినిమా రూపొందింది. ఈ సినిమాకు రమణ విల్లర్ట్ నిర్మాతగా వ్యవహరిస్తూనే డైరెక్షన్ చేశారు. కే రవి కృష్ణా రెడ్డి కో- ప్రొడ్యూసర్ గా పని చేశారు. ఈ సినిమాకు డా.సంకల్ప్ కథ, డైలాగ్స్, స్క్రీన్ ప్లే అందించగా.. శివ కృష్ణ సంగీతం అందించారు. సినిమాటోగ్రఫర్‌గా శివ రామ్ చరణ్ పని చేశారు. ఈ చిత్రం స్పెషల్ ప్రీమియర్‌కు రేణూ దేశాయ్, ఎస్వీ కృష్ణారెడ్డి, అచ్చి రెడ్డి, మధుర శ్రీధర్, జ్యోతి పూర్వాజ్, సుకు పూర్వాజ్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు.