హీరోయిన్ రష్మీక మందన్నకు అండగా తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్

బుధవారం, 8 నవంబరు 2023 (17:17 IST)
President Lakshmi Narayana, General Secretary Rambabu Telangana DGP Anjani Kumar
సోషల్ మీడియాలో ప్రముఖుల పేస్ లను మార్ఫింగ్  చేస్తూ వారి మనోభావాలను దెబ్బతీస్తు, కుటుంబాలవారు బాధపడేలా చేస్తున్న వారిపై తక్షణ చర్యలు తీసుకోవాలని బాధపడిన వారు పోలీస్ లను ఆశ్రయిస్తున్నారు. తాజాగా హీరోయిన్ రష్మిక మందన్న విషయం తెలిసిందే. ఆమె ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తూ లిఖిత పూర్వకంగా సోషల్ మీడియాలో చెప్పింది. ఇందుకు అమితాబ్ బచ్చన్ తో పాటు పలువురు రష్మికకు అండగా నిలిచారు. మార్ఫింగ్ చేసిన వారిని శిక్షించాలని తెలిపారు.
 
మార్ఫింగ్ అనేది ఇప్పుడు దేశ వ్యాప్తం గా సెలబ్రిటీస్ ఎదుర్కుంటున్న సమస్య. రష్మిక  మార్ఫింగ్ వీడియో ఇటీవల దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ విషయంలో తమ బాధ్యత గా తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఖండించడం తో పాటు రష్మికకు ధైర్యాన్ని నింపేవిధంగా నిలిచింది. అందులో భాగంగా  ప్రెసిడెంట్ లక్ష్మి నారాయణ, జనరల్ సెక్రటరీY j రాంబాబు తెలంగాణ డిజిపి అంజనీ కుమార్ కి నేడు పిర్యాదు  చేసారు.
 
బాధ్యతగా వ్యవహరించిన అసోసియేషన్ ని అభినందించిన అంజనీ కుమార్ గారు వెంటనే ఈ కేస్ ను సైబర్ క్రైం కి అప్పగించారు. ఇలాంటి చర్యలు జరిగిన వెంటనే తమ దృష్టి కి తీసుకు రావాలని సూచించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు