తెలుగు సినిమాలను, నటులను పరభాషలో లెక్కచేయరంటున్న హీరో

దేవి

మంగళవారం, 11 మార్చి 2025 (19:23 IST)
Telugu film logo
టాలీవుడ్‌ లో వింత పోకడ గత కాలంగా వున్నది. తెలుగు సినిమాలలో పరబాషా నటీనటులకు  పెద్ద పీట వేసి వారిని మన సినిమాల్లో తీసుకుని ఖరీదైన ట్రీట్‌ మెంట్‌ ఇవ్వడం మామూలే. కానీ మన నటీనటులను ఇతర భాషల్లో అస్సలు తీసుకోరు. తీసుకున్నా వారికి పెద్దగా పబ్లిసిటీ వుండదు. అలాగే తెలుగులో చేసిన సినిమాను నాలుగు భాషల్లో విడుదలచేయాలని ఇతర భాషల్లో విడుదలచేయాలంటే అక్కడ థియేటర్ల సమస్యతోపాటు చూసే ప్రేక్షకుడు కూడా వుండడు. ఇందుకు కారణం మనవారిని వారు లెక్కచేయకపోవడమేనని అనుభవ పూర్వకంగా తెలుసుకున్నానని  కథానాయకుడు కిరణ్‌ అబ్బవరం తెలియజేస్తున్నారు.
 
కొన్ని సినిమాలు చేశాక అప్‌ అండ్‌ డౌన్‌ లో వున్న ఆయన కెరీర్‌ 'క' అనే సినిమాతో కొత్త ఉత్సాహాన్ని  తెలుగు ప్రేక్షకులు ఇచ్చారు. అందుకే తన సినిమాను అక్కడా  విడుదలచేయాలని ప్రయత్నించి భంగపడ్డారు. దీనిపై ఆయన వ్యాఖ్యానిస్తూ, అగ్రహీరోలు, ఫేమ్‌ వున్న హీరోల సినిమాలు మినహా సెకండ్‌ గ్రేడ్‌ హీరోల సినిమాలను అస్సలు పరబాషలో చూడరు. కానీ పరబాషలో మూడోస్థాయి హీరోలుకానీ, కొత్తవారితో సినిమా తీస్తే ఆ సినిమాను తెలుగు నిర్మాతలే డబ్‌ చేసి మనపై రుద్దుతున్నారు. 
 
వాటిలో కొన్ని  ఆడతాయి. కొన్ని ఆడవు. అయినా వారికి థియేటర్లు ఇక్కడ వుంటాయి. కానీ మన సినిమాలను అక్కడ విడుదలచేయడానికి ఎవ్వరూ ముందుకు రారు. ఇది చాలా వింత పోకడ. ఒకరకంగా దారుణమైన విషయం. మరి ఈ విషయంలో ఇండిస్టీలో పెద్దలు తెలిసినా పట్టించుకోరు. కనుక బాషా బేధం తప్పకుండా ఇతర  సినిమారంగంలో వుంది అన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు