హీరో విశాల్‌కు ఏమైంది? మేనేజర్ వివరణ...

ఠాగూర్

బుధవారం, 8 జనవరి 2025 (11:12 IST)
హీరో విశాల్ గురించి తెలుగు ఆడియన్స్‌కి పరిచయం అక్కర్లేదు. పందెం కోడి, పొగరు, భరణి, పూజ, అభిమన్యుడు, డిటెక్టివ్, మార్క్ ఆంటోని, లాఠీ తదితర సూపర్ హిట్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించాడు. 
 
తెలుగు, తమిళంలో ఎన్నో చిత్రాల్లో నటించిన విశాల్ ఈ మధ్యకాలంలో మీడియా ముందుకి పెద్దగా రాలేదు. అయితే తాజాగా తన కొత్త సినిమా "మద గజ రాజ" ప్రమోషన్స్ కోసం వచ్చిన విశాల్‌ని చూసి అందరూ అవాక్కయ్యారు. అసలు ఏమైందని ఆరా తీస్తున్నారు.
 
"మద గజ రాజ" సినిమా ఈవెంట్‌లో హీరో విశాల్ వణుకుతూ కనిపించారు. గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. వేదికపై మాట్లాడుతుంటే.. స్టేజీపై మాట్లాడుతున్న స‌మ‌యంలో చేతులు కూడా వణుకుతూ క‌నిపించింది. క‌నీసం మైక్‌ను కూడా గ‌ట్టిగా ప‌ట్టుకోలేక‌పోతున్నాడు. 
 
అంతేకాదు.. మాట్లాడుతున్నపుడు నోట్లో నుంచి మాటలు కూడా సరిగా రాలేని స్థితిలో ఉన్నాడు. చాలా నిదానంగా మాట్లాడారు. సరిగా నడవలేకపోయారు దాంతో నిర్వాహకులు కుర్చీ వేసి కూర్చో బెట్టారు బక్కగా అయిపోయారు. దీంతో అసలు విశాల్‌కు ఏమైందనే చర్చ జరుగుతోంది.
 
విశాల్ ఆరోగ్య పరిస్థితిని తెలియజేసే హెల్త్‌ రిపోర్ట్‌ని విశాల్ టీమ్‌ విడుదల చేసింది. విశాల్ వైరల్‌ ఫీవర్‌తో బాధపడుతున్నారని.. వైద్యులు కంప్లీట్ బెడ్‌ రెస్ట్‌ తీసుకోవాలని చెప్పినట్లు ఆ రిపోర్టులో ఉంది అని చెప్పారని వార్తలు వస్తున్నాయి. నిజంగా జ్వరంతోనే బాధ పడుతున్నాడా ఇంకా ఏదైనా ప్రాబ్లమ్ ఉందా ఏదియేమైనా విశాల్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. 

 

We wish you a speedy recovery to Vishal Sir!
Get well soon and back to inspiring us all. ???? "#GetWellSoon #StayStrong#vishal pic.twitter.com/PULvzgXaKd

— Gaja Thoogudeepa (@gaja_tweetz) January 6, 2025

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు