తెలుగు తెరపై అందాల ఆరబోతకు అందరికంటే ముందే సై అనే ఆ ముద్దుగుమ్మకు సుడి బాగా ఉన్నట్లు లేదు. ఎంతగా అందాలారబోసినా సెకండ్ హీరోయిన్ పాత్రలకే ఎక్కువగా పరిమితం అవుతోంది. ఇద్దరమ్మాయిలతో చిత్రంలో అమలాపాల్‌తో కలిసి అల్లుఅర్జున్‌తో వీరలెవల్‌లో అందాలను ఆరబోసినా పెద్దగా ఫలితం దక్కలేదు. ఇటీవల సరైనోడు చిత్రంలోనూ రెండవ నాయకి పాత్రతోనే సరిపెట్టుకుంది.
తాజాగా ఆ చిత్ర దర్శకుడు బోయపాటి శీను తాజా చిత్రంలో ఐటమ్‌గర్ల్‌గా మారిపోయింది. ఇందుకు భారీ పారితోషికమే(రూ.60 లక్షలు) పుచ్చుకుందంటున్నారు సినిమా వర్గాలు. అదేమంటే బోయపాటి కోసమే ఈ చిత్రంలో నటించడానికి సమ్మతించాను అని సాకు చెబుతోంది.ఆయన సరైనోడు చిత్రంలో తనకు అవకాశం ఇచ్చారని,అందుకే ఆయన కోరిక మేరకు బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటిస్తున్న జై జానకి నాయక చిత్రంలో సింగిల్ సాంగ్‌కు అంగీకరించానని చెప్పుకొచ్చింది. అయితే ఇకపై ఐటమ్ సాంగ్‌కు ఆడేది లేదని అంటోంది.