నిర్మాత రవి శంకర్ శాస్త్రి మాట్లాడుతూ, సుశాంత్ యాక్టింగ్ హైలెట్‌గా ఉంటుంది. యాక్షన్, రొమాన్స్, సెంటిమెంట్ ఇలా అన్ని అంశాలుండే చిత్రమిది. దర్శకుడు దర్శన్, సుకుమార్ సినిమాటోగ్రఫీ, ప్రవీణ్ మ్యూజిక్ ఇలా మంచి టీమ్ కుదిరింది. ఆగస్ట్ 27న నా పుట్టినరోజు నా సినిమా విడుదల కావడం డబుల్ ధమాకాగా భావిస్తున్నాను అన్నారు.
నిర్మాత హరీశ్ కోయిలగుండ్ల మాట్లాడుతూ నాగేశ్వరరావుగారి మనవడు, భానుమతిగారి మనవడు కలిసి సినిమా చేస్తే బావుంటుందని రవిశంకర్‌గారితో చెప్పగానే ఆలోచన బావుందని ఆయన ఒప్పుకున్నారు. దర్శన్ చెప్పిన కథ బాగా నచ్చింది. చి.ల.సౌ సమయంలో ఈ సినిమా కథ విన్న సుశాంత్ వెంటనే ఒప్పుకున్నారు. రవిశంకర్‌గారు వచ్చిన తర్వాత ప్రాజెక్ట్ స్కేల్ మారిపోయింది. మా సినిమా రెండు లాక్‌డౌన్స్‌ను తట్టుకుని ఇక్కడి దాకా వచ్చిందంటే రవిశంకర్‌గారు, ఏక్తాగారే కారణం.ప్రవీణ్ లక్కరాజు ఈ మ్యూజిక్‌తో నెక్ట్స్ లెవల్ మ్యూజిక్ డైరెక్టర్ అవుతాడు. గ్యారీ ఎడిటింగ్ సినిమాకు మరింత ప్లస్ అయ్యింది. అన్నీ పర్‌ఫెక్ట్‌గా కుదిరాయి. వెంకట్‌గారు చాలా కీలకమైన పాత్రలో నటించారు. కొత్త నటీనటులను కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. సుశాంత్ కారణంగానే నేను నిర్మాతనయ్యాను అన్నారు.
ప్రవీణ్ లక్కరాజు మాట్లాడుతూ గీతాంజలి, ఎక్స్‌ప్రెస్ రాజా చిత్రాల తర్వాత అనుకోకుండా మూడేళ్లు గ్యాప్ వచ్చింది. ఇండస్ట్రీకి మంచి చిత్రంతో రావాలని అనుకుంటున్న సమయంలో ఈ సినిమాలో అవకాశం వచ్చింది. నాపై నమ్మకంతో సుశాంత్ ఇచ్చిన సపోర్ట్‌తో ఇంత మంచి మ్యూజిక్ ఇవ్వగలిగాను. మ్యూజిక్, బ్యాగ్రౌండ్ స్కోర్ విషయంలో చాలా ఫ్రీడమ్ ఇచ్చారు. పాటలకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమా కూడా కచ్చితంగా నచ్చుతుంది అన్నారు.
హీరో సుశాంత్ మాట్లాడుతూ, దర్శన్ ఈ సినిమాను నిరంజన్ రెడ్డిగారితో చేయాల్సింది. తనతో ఈ సినిమా చేయాలనుకున్నప్పుడు నిరంజన్‌రెడ్డిగారితో మాట్లాడి, ఆయన ఒప్పుకున్న తర్వాతే ఈ సినిమాను స్టార్ట్ చేశాం. ఈ సందర్భంగా నిరంజన్‌గారికి థాంక్స్. చి.ల.సౌ సినిమా అప్పుడు విడుదలవుతుంది. ఆ సినిమా ఆడినా, ఆడకపోయినా ఈ సినిమా చేస్తానని అప్పుడు దర్శన్‌తో చెప్పాను. కథ రియలిస్టిక్‌గా, గ్రిప్పింగ్ ఉండటంతో ఈ కథను వదులుకోకూడదని అనుకున్నాను. భానుమతిగారి మనవడు అని తెలియడంతో ఆనందమేసింది. తాతగారు, భానుమతిగారి ఆశీర్వాదాలు మాకు ఉన్నాయని తెలిసింది. ఈ సినిమా కంటే ముందు అల వైకుంఠపురములో సినిమా చేశాను. ఎట్టకేలకు ఈ సినిమాను ఆగస్ట్ 27న మీ ముందుకు తీసుకొస్తున్నాం. ఓ నటుడిగా ఈ సినిమా నన్నెంతో శాటిస్పై చేసింది. మీనాక్షి చౌదరిని ముంబైలో ఓ వర్క్ షాప్‌లో కలిశాను. తనకు ఈ సినిమా చేయాలని కోరాను. తను ఓకే అంది. ఈ సినిమా విడుదల కాకముందే తను బిజీ హీరోయిన్ అయ్యింది. వెన్నెల కిషోర్, ప్రియదర్శి, అభినవ్, కృష్ణచైతన్య ఇలా మంచి ఆర్టిస్టులు సినిమాకు కుదిరారు. సినిమాలో కొత్తదనం ఉంటుంది. సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయి. అన్ని ఎమోషన్స్ ఉంటాయి. రొటీన్‌కు భిన్నమైన చిత్రమని గ్యారంటీగా చెప్పగలను అన్నారు.