ఓటీటీలోకి రానున్న ది కేరళ స్టోరి.. ఎప్పుడంటే?

సెల్వి

శనివారం, 6 జనవరి 2024 (23:26 IST)
సూపర్ హిట్ సినిమా ది కేరళ స్టోరి ఓటీటీలోకి రానుంది. ముఖ నిర్మాణ సంస్థ సన్‌షైన్ పిక్చర్స్ బ్యానర్‌పై సుదిప్టో సేన్ దర్వకత్వంలో విపుల్ అమృత్‌లాల్ షా నిర్మించిన ఈ చిత్రంలో ఆదా శర్మ, యోగితా బలానీ, సిద్ది ఇద్నానీ, సొనియా బలానీ కీలక పాత్రల్లో కనిపించారు. 
 
వివాదాస్పదంగా మారిన ఈ సినిమా 2023 మే 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ ఓటీటీలోకి రిలీజ్ కాలేదు.  ఇక ది కేరళ స్టోరి సినిమా తొలి రోజు నుంచే భారీగా కలెక్షన్లను రాబట్టింది. ఇండియాలో ఈ చిత్రం హిందీ వెర్షన్ 240 కోట్లకుపైగా, ఓవర్సీస్‌లో 15 కోట్ల రూపాయలు, అలాగే ప్రపంచవ్యాప్తంగా 300 కోట్ల రూపాయలు వసూలు చేసింది. 
 
హిందీలో 240 కోట్లు, తెలుగులో 3 కోట్ల రూపాయలు వసూలు చేసింది. కానీ ఏ ఓటీటీ సంస్థ కూడా కొనడానికి ముందుకు రాలేదు. చివరికి ది కేరళ స్టోరి సినిమాను చివరకు జీ5 సంస్థ ఓటీటీ హక్కులను సొంతం చేసుకొంది. 
 
ఈ సినిమాను జనవరిలో ఓటీటీ ద్వారా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని జనవరి 12న గానీ, లేదా జనవరి 19వ తేదీన గానీ విడుదలయ్యే ఛాన్సుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు