Raghavendra Rao at Bhola Shankar's set
మెగాస్టార్ చిరంజీవి, స్టైలిష్ మేకర్ మెహర్ రమేష్ ల మెగా మాసివ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ “భోళా శంకర్” షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో వేసిన మాసీవ్ కోల్‌కతా సెట్‌లో ఈ సినిమా పాట చిత్రీకరణ జరుగుతోంది. చిరంజీవి, కీర్తి సురేష్, మరికొందరు నటీనటులు, 200 మంది డ్యాన్సర్లు పాల్గొంటున్న ఈ పాట చిత్రీకరణ భారీ ఎత్తున జరుగుతోంది. ఈ పాటకు కొరియోగ్రఫీని శేఖర్ మాస్టర్ చేస్తుండగా, మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నాడు.
లెజెండరీ ఫిల్మ్ మేకర్ కె రాఘవేంద్రరావు సినిమా సెట్‌ని సందర్శించి టీమ్‌తో సరదాగా గడిపారు. మెగాస్టార్ చిరంజీవి బ్లాక్‌బస్టర్ చూడాలని వుంది లోని సూపర్‌హిట్ పాటను చిత్రీకరించినప్పుడు కోల్‌కతా సెట్‌ను సందర్శించిన జ్ఞాపకాలను ఆయన గుర్తు చేసుకున్నారు. కోల్‌కతా బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న భోళా శంకర్ చాలా పెద్ద బ్లాక్‌బస్టర్ అవుతుందని టీంకు బెస్ట్ విశేష్ అందించారు.
మెగాస్టార్ చిరంజీవితో జగదేకవీరుడు అతిలోకసుందరి, రౌడీ అల్లుడు, ఘరానా మొగుడు మొదలైన అనేక బ్లాక్‌బస్టర్‌లను రూపొందించిన రాఘవేంద్రరావు.. వాల్తేరు వీరయ్య విజయంపై మెగాస్టార్‌ను అభినందించడానికి భోళా శంకర్ సెట్‌కి వచ్చారు. సెట్‌లో అద్భుతమైన వైబ్స్ చూసిన రాఘవేంద్రరావు మాట్లాడుతూ .. ప్రస్తుతం చిత్రీకరిస్తున్న పాట రామ్మ చిలకమ్మ లాగా చార్ట్‌బస్టర్ అవుతుందని, భోళా శంకర్ సినిమా చూడాలని వుంది లాంటి బ్లాక్ బస్టర్ అవుతుందని అన్నారు.
క్రియేటివ్ కమర్షియల్స్‌తో కలిసి అనిల్ సుంకర ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. మహతి స్వర సాగర్ సంగీతం అందించగా, డడ్లీ డీవోపీగా పని చేస్తున్నారు. సత్యానంద్ కథ పర్యవేక్షణ చేయగా తిరుపతి మామిడాల డైలాగ్స్ అందిస్తున్నారు. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటర్ గా, ఎఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేస్తున్నారు. కిషోర్ గరికిపాటి ఎగ్జిక్యూటివ్ నిర్మాత.
తారాగణం: చిరంజీవి, తమన్నా, కీర్తి సురేష్, రఘుబాబు, రావు రమేష్, మురళీ శర్మ, రవిశంకర్, వెన్నెల కిషోర్, తులసి, ప్రగతి, శ్రీ ముఖి, బిత్తిరి సత్తి, సత్య, గెటప్ శ్రీను, రష్మీ గౌతమ్, ఉత్తేజ్, ప్రభాస్ శీను తదితరులు.
సాంకేతిక వర్గం :
స్క్రీన్ ప్లే, దర్శకత్వం: మెహర్ రమేష్, నిర్మాత: రామబ్రహ్మం సుంకర, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కిషోర్ గరికిపాటి, సంగీతం: మహతి స్వర సాగర్, డీవోపీ: డడ్లీ, ఎడిటర్: మార్తాండ్ కె వెంకటేష్, కథా పర్యవేక్షణ: సత్యానంద్, డైలాగ్స్: తిరుపతి మామిడాల, ఫైట్ మాస్టర్స్: రామ్-లక్ష్మణ్, దిలీప్ సుబ్బరాయన్, కాచే కంపాక్డీ, లిరిక్స్: రామజోగయ్య శాస్త్రి, కాసర్ల శ్యామ్, శ్రీమణి, సిరాశ్రీ, వీఎఫ్ఎక్స్ సూపర్‌వైజర్: యుగంధర్.