ఇక గోపీచంద్‌కు తేజ చెప్పిన సమాధానం ఇదే. సినిమాను ఓటీటీ, సింగిల్ స్క్రీన్ చంపలేదు. కేవలం మల్టీప్లెక్స్ చంపేస్తుంది. అందులోనూ పాప్‌కార్న్ చంపేస్తుంది. అంటూ వివరించారు. నేను బాలీవుడ్ నుంచి అన్ని వుడ్‌లకు వెళ్ళీ అక్కడ కామన్ మేన్ నుంచి వివరాలు సేకరించాను. మిగిల్‌క్లాస్ సినిమాకు వెళితే బైక్ పార్కింగ్, ఆ తర్వాత పాప్‌కార్న్ కానీ సమోసా, కూల్ డ్రింక్ కానీ తాగుతూ సినిమా చూడాలనుకుంటే ఈ రేట్లు ఆడియన్‌ను భయపెట్టిస్తుంది. సినిమా టికెట్ కంటే ఈ రేట్లు ఎక్కువ.
ముంబైలో సినిమా చచ్చిపోవడానికి కారణం మల్టీప్లెక్స్ థియేటర్లే. తెలుగులో ఇంకా సినిమా చచ్చిపోకుండా బతికి వుందంటే సింగిల్ స్క్రీన్ వుండడం వల్లనే. మల్టీప్లెక్స్ తెర అంటే మన ఇంటిలో టీవీకంటే కొంచెం ఎక్కువ వుంటుంది. అంతే తేడా. నా తీర్పు ఏమిటంటే ఓటీటీలు, టీవీలు సినిమాను చంపలేదు. కేవలం పాప్‌కార్న్ చంపేస్తుంది అని ముగించారు.