నిర్మాత బన్నీ వాసు టికెట్ ధరల గురించి ప్రస్తావిస్తూ, రేట్స్ అందుబాటులో ఉండాలని కోరుకునే వ్యక్తుల్లో అరవింద్ గారు ,తాను మొదటి వ్యక్తులమని పేర్కొన్నారు. నైజంలో 160+gst, ఆంధ్ర మల్టిఫ్లెక్స్ లో 150+gst, సింగిల్ స్క్రీన్ లో 100+gst అని అన్నారు. అందరు టికెట్ కోసం పెట్టిన డబ్బులకి హ్యాపీగా నవ్వుకుంటూ వెళ్ళాలనే తమ ఉద్దేశ్యమని తెలిపారు. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆన్‌లైన్ టికెట్‌పై ఆయన స్పందించలేదు. త్వరలో చలనచిత్రరంగం పెద్దలు కలిసి మాట్లాడుకుంటామన్నారు.