'మా' అధ్యక్షుడుగా బాధ్యతలు స్వీకరించిన మంచు విష్ణు

బుధవారం, 13 అక్టోబరు 2021 (13:37 IST)
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) కొత్త అధ్యక్షుడుగా మంచు విష్ణు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ నెల 10వ తేదీన జరిగిన ఎన్నికల్లో మంచు విష్ణు తన ప్రత్యర్థి ప్రకాష్ రాజ్‌పై 107 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. ఈ క్ర‌మంలో మా అధ్యక్షుడిగా మంచు విష్ణు బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన పెన్షన్ల ఫైలుపై తొలి సంతకం చేశారు.
 
అయితే, తమ ప్రత్యర్థి వర్గం ప్ర‌కాశ్ రాజ్ ప్యానెల్ నుంచి గెలిచిన సభ్యులంతా సోమవారం మూకుమ్మడిగా రాజీనామాలు చేసిన విషయం తెల్సిందే. దీంతో ఇప్పుడువారి స్థానాల‌ని భ‌ర్త చేస్తారా లేదంటే వేరే నిర్ణ‌యం తీసుకుంటారా అనే దానిపై అంద‌రిలో ప‌లు సందేహాలు నెల‌కొన్నాయి. ‘మా’ బైలాస్‌కి అనుగుణంగా విష్ణు ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటాడా అన్న‌ది స‌ర్వ‌త్రా ఆస‌క్తిక‌రంగా మారింది.
 
అంతకుముందు భవిష్యత్‌లో మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా)లో ఎలాంటి గొడవలు లేకుండా సజావుగా సాగడానికి తమ ప్యానెల్‌ నుంచి గెలుపొందిన 11 మంది రాజీనామా చేస్తున్నట్లు సినీ నటుడు ప్రకాశ్‌రాజ్‌ ప్రకటించిన విషయం తెల్సిందే. 

 

I have today assumed the office of the President of MAA! Need all your wishes and send me positivity as much as you can. #MAA pic.twitter.com/cYUiuxmwQ9

— Vishnu Manchu (@iVishnuManchu) October 13, 2021

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు