సినీ నటుడు జయప్రకాష్ రెడ్డి ఇకలేరు.. స్నానాల గదిలో పడి మృతి

మంగళవారం, 8 సెప్టెంబరు 2020 (08:38 IST)
తెలుగు చిత్రపరిశ్రమ మరో ఆణిముత్యాన్ని కోల్పోయింది. ప్రముఖ సినీ నటుడు జయప్రకాశ్ రెడ్డి (74) కన్నుమూశారు. మంగళవారం తెల్లవారుజామున గుండెపోటుతో బాత్‌రూమ్‌లోనే కుప్పకూలిపోయారు. కుటుంబ సభ్యులు ఆయన్ని ఆస్పత్రికి తీసుకెళ్లగా ఆయన చనిపోయినట్లు నిర్ధారించారు. కరోనా కారణంగా సినీమా షూటింగ్‌లపై ప్రభుత్వం నిషేధించడంతో అప్పటి నుంచి ఆయన గుంటూరులోనే ఉంటున్నారు. 
 
లాక్‌డౌన్ నుంచి గుంటూరులోనే ఉంటున్న ఆయన ఈ ఉదయం స్నానాల గదిలో కుప్పకూలి మరణించారు. జయప్రకాశ్ రెడ్డి స్వస్థలం కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలంలోని సిరివెళ్ల. 8 మే 1946లో జన్మించిన జయప్రకాశ్‌ రెడ్డి, సీనియర్ హీరో వెంకటేశ్ నటించిన "బ్రహ్మపుత్రుడు" సినిమాతో తెలుగు చిత్ర సీమకు పరిచయమయ్యారు. జయప్రకాశ్ రెడ్డి మృతి విషయం తెలిసి తెలుగు చిత్రపరిశ్రమ విషాదంలో మునిగిపోయింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు