తేజస్వి మదివాడ.. తెలుగు చిత్ర పరిశ్రమలో పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. బిగ్ బాస్-2 సీజన్‌లో అగ్గిరాజేసిన తెలుగు పిల్ల. ఆ తర్వాత సినిమాల్లో మంచి అవకాశాలు వస్తాయని భావించారు. కానీ, సీన్ రివర్స్ అయింది. వెండితెర అవకాశాలు పెద్దగా రాలేదు. పైగా, సైడ్ క్యారెక్టర్లు కూడా మందగించాయి.
రోజుకొక హాట్ ఫోటోతో సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. అందాల ఆరబోతకు ఏమాత్రం మొహమాటపడని ఈ తెలుగమ్మాయికి అవకాశాలు మాత్రం ఆమడ దూరంలోనే ఉంటున్నాయి. అయితే, ఇటీవల 'కమిట్మెంట్' అనే సినిమా చేస్తున్నట్టు తెలిపింది.