నెట్‌ఫ్లిక్స్ - అమెజాన్‌లతో భారీ నష్టాలు : సురేష్ బాబు

ఆదివారం, 17 నవంబరు 2019 (15:21 IST)
సినీ ఇండస్ట్రీని డిజిటల్ మీడియా శాసిస్తోంది. ముఖ్యంగా, నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ వంటి సంస్థలు వంటి డిజిటల్ కంపెనీలు హవా కొనసాగిస్తాయి. ఈ సంస్థలు డిజిట‌ల్ సంస్థ‌లు సినిమాల‌ను భారీ రేటుకు కొంటున్నాయి. సినిమాలు విడులైన రెండు నెల‌ల‌కే వాటిని త‌మ మాధ్య‌మంలో ప్ర‌ద‌ర్శిస్తున్నాయి. 
 
ఫలితంగా సినిమా బిజినెస్ ప‌రంగా ఇది నిర్మాత‌ల‌కు లాభాల‌ను తెచ్చి పెడుతుంద‌డ‌నంలో సందేహం లేదు. అయితే వీటి కార‌ణంగా సాధార‌ణ ప్రేక్ష‌కుడు థియేట‌ర్‌కు రావ‌డం త‌గ్గిపోయింది. దీని వ‌ల్ల డిస్ట్రిబ్యూట‌ర్స్‌, థియేట‌ర్ యజ‌మానులు న‌ష్ట‌పోతున్నార‌ు. 
 
ఈ విషయంపై సీనియర్ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు స్పందిస్తూ, ఒక‌ట్రెండు భారీ సినిమాల‌ను మాత్ర‌మే ప్రేక్ష‌కులు థియేట‌ర్‌లో చూడ‌టానికి ఇష్ట‌ప‌డుతున్నాడు. 
 
ఓ మోస్త‌రు బ‌డ్జెట్ సినిమాలు, చిన్న సినిమాల‌ను థియేట‌ర్‌లో చూడ‌టానికి ప్రేక్ష‌కుడు ఇష్ట‌ప‌డ‌టం లేదు. దీంతో థియేట‌ర్ య‌జ‌మానుల‌కు క‌నీస ఆదాయం కూడా లేకుండా పోతుంద‌ని సురేష్‌బాబు తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు