నిన్ననే మనం మాట్లాడుకున్నాం అయితే ఇదే చివరిసారి అవుతుందని అనుకోలేదని, మీరు లేరు అన్న మాటను జీర్ణించుకోలేకపోతున్నానని, మీరు లేరని తెలిసాక మాటలు రావడం లేదని తెలిపారు. స్వర్గంలో మీరు సంతోషంగా వైన్ తాగుతూ సంతోషంగా ఉంటారని అనుకుంటున్నానని ఆశిస్తున్నాను.
నాకెంతో ప్రియమైన ఆంటీ మీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నానని చార్మీ ఎమోషనల్ పోస్టు పెట్టారు. ఇక చార్మీ చాలా సినిమాలో నటించింది. హీరోయిన్‌గా అవకాశాలు తగ్గుముఖం పడుతున్న సమయంలో చార్మీ నిర్మాతగా మారారు. ఆమె “జ్యోతిలక్ష్మీ” అనే సినిమాలో నటించింది చివరిది. ఈ సినిమా నిర్మాత కూడా చార్మినే. తర్వాత ఇస్మార్ట్ శంకర్ సినిమాని పూరితో కలిసి నిర్మించింది. ఈ సినిమా అటు పూరికి ఇటు చార్మీకి మంచి పేరును తీసుకువచ్చింది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా వస్తున్న పైటర్ అనే సినిమాకు కూడా చార్మీ నిర్మాతగా వ్యవహరిస్తుంది.