మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టి ట్రాన్స్‌జెండర్ ఉమెన్ (హిజ్రా) అంజలి అమీర్‌తో జతకట్టబోతున్నారు. ఇప్పటికే మోడల్‌గా మంచి గుర్తింపు పొందిన అంజలి అమీర్‌కు 'పేరంబు' తొలి తమిళ సినిమా. ఇందులో మమ్ముట్టి సరసన అంజలి అమీర్ నటిస్తోంది. పేరంబు సినిమాలో అంజలి అమీర్ తన కోస్టార్ అంటూ స్వయంగా మమ్ముట్టి ట్వీట్ చేశారు.
కాగా, మమ్ముట్టితో కలిసి నటించడం సరికొత్త అనుభవం అంటోంది అంజలి. ఆయన ప్రోత్సాహం మరువలేనిదని చెప్పుకొచ్చింది. మమ్ముట్టి చాలా గ్యాప్ తర్వాత చేస్తున్నారు. ఈ చిత్రంలో తన కో-స్టార్‌గా అంజలి అమీర్ నటిస్తోందంటూ ఈ స్టార్ హీరో స్వయంగా ట్వీట్ చేశారు.
Anjali Ameer, one of my costars in Ram's "Peranbu"
- Mammootty (@mammukka) January 15, 2017