త్రిష విషయానికొస్తే.. దాదాపు రెండు దశాబ్దాల క్రితం తరుణ్ హీరోగా నటించిన 'నీ మనసు నాకు తెలుసు' సినిమా ద్వారా హీరోయిన్‌గా పరిచయమైంది. ఆ తర్వాత తెలుగులో దాదాపు సీనియర్ , జూనియర్ అనే తేడా లేకుండా అందరి అగ్ర హీరోల సరసన నటించింది. ప్రస్తుతం తెలుగులో చిరంజీవి హీరోగా నటిస్తోన్న 'విశ్వంభర'తో తెలుగులో మళ్లీ రీ ఎంట్రీ ఇస్తోంది.
ఈ నేపథ్యంలో హైదారాబాద్‌లో ప్రత్యకంగా వేసిన 'విశ్వంభర' షూటింగ్ సెట్‌లో అన్నయ్యను మరో అన్నయ్య నాగబాబుతో కలిసి పవన్ కళ్యాణ్ మర్యాద పూర్వకంగా కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సందర్భంగా చిరంజీవి, పవన్ కళ్యాణ్, త్రిష, యూనిట్‌తో కలిసి దిగిన ఫోటోలు వైరల్ అయ్యాయి.