టి సుబ్బరామిరెడ్డి కల్చరల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో టీఎస్సార్ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ 2015-16 కార్యక్రమం శనివారం రాత్రి విశాఖలో జరిగింది. పోర్టు స్టేడియంలో జరిగిన ఈ వేడుకలను కళాబంధు టీ సుబ్బిరామిరెడ్డి నిర్వహించారు. అయితే, ఈ అవార్డుల కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు.
అవార్డుల ప్రధానోత్సవం తర్వాత ప్రియాంక చోప్రా కజిన్ మన్నారా చోప్రా పెర్ఫార్మెన్స్ సాగుతోంది. ఇది పూర్తికాగానే, ఓ పోలీసు అధికారి స్టేజ్‌పైకి వచ్చి మైక్ అందుకుని ‘‘క్షమించాలండి. ఇక్కడ పది గంటల వరకే అనుమతిఇచ్చాం. ఇప్పుడు 10:40 అయ్యింది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఆపేస్తున్నాం’’ అని అనౌన్స్ చేశారు.