రూ.41కోట్ల వసూళ్లతో బాహుబలి2 హిందీ వెర్షన్‌ టాప్- ట్యూబ్‌లైట్‌కు రెండో స్థానం

శనివారం, 24 జూన్ 2017 (17:04 IST)
ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను చూరగొన్న బాహుబలి-2 కొత్త రికార్డును తన ఖాతాలో వేసుకుంది. బాహుబలి2.. ఈ ఏడాది (2017)లో తొలిరోజు అత్యధిక వసూళ్లు రాబట్టిన హిందీ సినిమాల్లో అగ్రస్థానంలో కొనసాగుతుంది. రూ.41 కోట్ల వసూళ్లతో బాహుబలి-2 హిందీ వెర్షన్ విడుదలైన తొలిరోజే భారీ కలెక్షన్లు నమోదు చేసుకుంది. ఇక బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ తాజా సినిమా ''ట్యూబ్ లైట్" అంచనాలకు తగ్గట్టు వెలగకపోయినా... వసూళ్ల విషయంలో మాత్రం దూసుకెళ్లింది. 
 
విడుదలైన తొలిరోజే దేశ వ్యాప్తంగా రూ.21.15 కోట్ల వసూళ్లతో.. 2017లో అత్యధిక వసూళ్లు సాధించిన రెండో సినిమాగా నిలిచింది. రూ.100 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ‘ట్యూబ్‌లైట్’ సినిమా దేశ వ్యాప్తంగా 5000 పైగా థియేటర్లలో విడుదలైనట్లు సమాచారం. విదేశాల్లో ట్యూబ్‌లైట్ మూవీ 1200 స్క్రీన్లపై విడుదల కానున్నట్లు సమాచారం.

వెబ్దునియా పై చదవండి