Union Minister Ramdas Atwala, Prem Bhandari, Suma Kanakala, Abhishek Agarwal
హైదరాబాద్ః అనుకోని ప్రమాదాల్లో కాళ్లు, చేతులు కోల్పోయి వికలాంగులుగా మారిన వారికి చేయూతనిచ్చేందుకు జైపూర్ ఫుట్ యూఎస్ సంస్థ ముందుకొచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో సుమారు వెయ్యి మందికిపైగా వికలాంగులకు ఉచితంగా జైపూర్ ఫూట్, లింబ్స్ అందించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు హైదరాబాద్ లోని హైటెక్ సిటీలో
పీపుల్ టెక్ సంస్థ అధినేత విశ్వప్రసాద్ ఆధ్వర్యంలో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అసోసియేషన్, జైపూర్ ఫూట్ యూఎస్ఏ, భగవత్ మహవీర్ వికలాంగ సహాయ సమితి, జైపూర్ ఇండియా, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, పీపుల్స్ టెక్, ఫెస్టివల్స్ ఆఫ్ జాయ్ సంస్థలు చేపట్టిన జైపూర్ ఫుట్ క్యాంపును కేంద్ర సామాజిక శాఖ మంత్రి రాందాస్ అత్వాల లాంఛనంగా ప్రారంభించారు.