హైదరాబాద్‌లో ఓ అరుదైన జాతి పిల్లిని గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసిన ఘటన జంతు ప్రేమికులను కలచివేసింది. ఈ ఘటన హైదరాబాద్‌లోని వనస్థలిపురలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తప్పిపోయిన పిల్లి ఖౌ మనీ జాతికి చెందినది. ఇది నీలం, ఆకుపచ్చ రంగు కన్నును కలిగి ఉంది.