డ్రగ్స్ మీద ఆధారపడటం మనలో చాలా మందికి జీవితంతో విడదీయరాని విషయం అయ్యింది. నొప్పులు, నిద్ర లేమి, జలుబు, ఫ్లూ, దగ్గు ఇలాంటి అనారోగ్యాలకు దీర్ఘకాలం డ్రగ్స్ తీసుకుంటూ ఉంటారు. డ్రగ్ లపై ఆధారపడటం శరీరానికి ఎంతో హాని చేస్తుంది. డ్రగ్ అడిక్షన్ నుంచి బయటపడినప్పుడే మనం ఈ ఆరోగ్య సమస్యలను సగం గెల్చినట్లు. యువర్ లైఫ్ వెబ్ పోర్టల్ ఈ విషయం మీద అవగాహన కల్పించేందుకు ముందుకొచ్చింది.
మన జీవితంలో డ్రగ్స్ కు అడిక్ట్ కావడం అనే అంశం మీద న్యూరాలజీ డాక్టర్ సి రాజేష్‌తో కలిసి నవదీప్ తమ సూచనలు, అనుభవాలు తెలపనున్నారు. వ్యసనం అనేది మన మనసుకు సంబంధించిన విషయం, దీన్ని అధిగమించేందుకు విలువైన సలహాలు 'హై ఆన్ లైఫ్' డిస్కషన్‌లో అందించనున్నారు.