ఈ టీజర్‌లో ఒక గుడిలోని పూజారులను గూండాల గుంపు తీవ్రంగా కొట్టింది. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ కఠినమైన పోలీసుగా పవర్-ప్యాక్డ్ ఎంట్రీ ఇచ్చి, "గాజు ఎంత పగలగొడితే అంత పదును పెడుతుంది"అని కౌంటర్ ఇచ్చాడు. ఇంకా ఖచ్చితంగా గుర్తుపెట్టుకో.. గ్లాస్ అంటే సైజు కాదు సైన్యం కనిపించని సైన్యం. గాజు పగిలే కొద్దీ పదునెక్కుద్ది.. అనే డైలాగ్ టీజర్‌కు హైలైట్‌గా నిలిచింది.
ఇకపోతే.. దర్శకుడు హరీష్ శంకర్ ఈ సినిమాలోని యాక్షన్ సీక్వెన్స్‌ను విపరీతంగా, మాస్ ఆకట్టుకునేలా డిజైన్ చేశారు. ఇందులో క్యాప్చర్ చేసిన విజువల్స్ టాప్-క్లాస్. ఇంకా దేవి శ్రీ ప్రసాద్ తన రాకింగ్ స్కోర్‌తో విజువల్స్ ఎలివేట్ చేశాడు. పవన్ కళ్యాణ్ పోలీస్‌గా డాషింగ్‌గా కనిపించాడు. అతని డైలాగ్ డెలివరీ, స్క్రీన్ ప్రెజెన్స్ అద్భుతంగా నిలిచింది. ఇంకా ఈ టీజర్‌లోని పీకే డైలాగ్స్ అభిమానులకు పూనకాలు వచ్చేలా చేశాయి.