పవన్ కల్యాణ్‌కు రాజకీయాలు తెలియవు.. క్లోజ్ కావడం ఖాయం - ముద్రగడ

సెల్వి

శనివారం, 16 మార్చి 2024 (12:50 IST)
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గురించి కాపు నేత ముద్రగడ పద్మనాభం హాట్ కామెంట్లు చేశారు. పవన్‌ను మార్చాలని తాను ఎంతో ప్రయత్నించానని చెప్పారు. పవన్ కల్యాణ్‌కు రాజకీయాలు తెలియవని వెల్లడించారు. ఎన్నికల తర్వాత జనసేన క్లోజ్ కావడం ఖాయమని జోస్యం చెప్పారు. రాజకీయాల్లో సినిమా వాళ్లను నమ్మే రోజులు పోయాయని అన్నారు. వాస్తవం మాట్లాడాలంటే ఎన్టీఆర్ తరువాత ప్రజలు సినిమా నటుల్ని నమ్మలేదన్నారు. 
 
గత ఎన్నికల్లో పోటీ చేసిన రెండు చోట్లా పవన్ ఓడిపోయారని... ఈ ఎన్నికల్లో కేవలం 21 సీట్లకే పరిమితమయ్యారని అన్నారు. ఈ 21 సీట్లలో ఎన్ని గెలుస్తారో పవన్‌కే తెలియదని చెప్పారు. ఏదో ఆశించి తాను వైసీపీలో చేరలేదని... రాష్ట్ర ప్రయోజనాలే తనకు ముఖ్యమని ముద్రగడ క్లారిటీ ఇచ్చారు. రాజకీయాల్లో తాడు, బొంగరం లేనివాడు తనకు పాఠాలు చెబుతున్నాడని మండిపడ్డారు. మీది ఏం పొడుగని మీ వద్దకు రావాలని ప్రశ్నించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు